NCLT: NCLTలో జగన్‌కు చుక్కెదురు.. విజయమ్మకే ఆ షేర్స్!

NCLTలో మాజీ సీఎం జగన్‌కు చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై చెన్నై NCLT బెంచ్ విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29 న NCLT హైదరాబాద్ బెంచ్ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

New Update
ysr

NCLTలో మాజీ సీఎం వైఎస్ జగన్‌(YS Jagan)కు చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై చెన్నై NCLT బెంచ్ విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29 న NCLT హైదరాబాద్ బెంచ్ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే  NCLT హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్ లో విజయమ్మ అప్పీల్ దాఖలు చేయగా నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్ పై యధాతథాస్థితి (Status quo) కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. 

Also Read :  రైతులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి ముందే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి

NCLT Big Shock To YS Jagan

ఈ మేరకు గతంలో సోదరి షర్మిల (YS Sharmila) పేరు మీద తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) అక్రమంగా షేర్లను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు. ఆ షేర్ల బదలాయింపును వెంటనే రద్దు చేయాలంటూ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్‌పై 2025 జూలై 15న విచారణ చేపట్టిన ట్రైబ్యూనల్ తీర్పును జులై 29కి రిజర్వ్ చేసింది. షర్మిల, విజయమ్మ సర్వస్వతీ షేర్లను బదిలీ చేయడం అక్రమమేనని,  షేర్ల బదిలీని వెంటనే నిలిపివేయాలని NCLT ఆదేశాలు జారీ చేసింది.

Also Read :  ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

అయితే NCLT హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్ లో విజయమ్మ అప్పీల్ దాఖలు చేయగా నేడు విచారణ చేపట్టి జస్టిస్ ఎన్ శేషసాయి, టెక్నికల్ సభ్యుడు జతీంద్రనాథ్‌లతో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. విజయమ్మ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. షేర్ల బదిలీ పూర్తిగా చట్టపరమైనదిగా జరిగిందని పేర్కొన్నారు. అయితే దీనిపై షర్మిల ఎలా స్పందిస్తారనేది అసక్తికరంగా మారింది. తన తల్లికి అనూకూలంగా తీర్పు రావడంతో జగన్ అవినీతిపరుడనడానికి ఇదే నిదర్శనమనే సంచలన ఆరోపణలు చేసే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు