Haryana: IPS పురాన్ కేసులో మరో షాకింగ్.. ఆ గదిలో దర్యాప్తు అధికారి సూసైడ్!

హర్యానా IPS అధికారి వై. పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి తుపాకితో కాల్చుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది.

New Update
hryna

Haryana:హర్యానా IPS అధికారి వై. పురాణ్ కుమార్ సూసైడ్ కేసు(suicide-case) లో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి తుపాకితో కాల్చుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది. రోహ్‌తక్‌ ఫామ్ హౌస్‌లోని ఒక గదిలో ఈ దారుణానికి పాల్పడగా మృతుడిని సందీప్ లాథర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఏఎస్సై సందీప్‌కుమార్‌ రోహ్‌తక్‌ సైబర్‌ సెల్‌లో విధులు నిర్వహిస్తుండగా పూరన్‌ కు సంబంధించిన ఓ అవినీతి కేసును ఆయనే దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూరన్‌ కుమార్‌పై తన సూసైడ్‌ నోట్‌లో సందీప్ సంచలన ఆరోపణలు చేశారు.

సూసైడ్ నోట్‌ లో షాకింగ్స్..

ఈ మేరకు మూడు పేజీల సూసైడ్ నోట్‌ లో ఇలా రాశారు. 'నేను సత్యం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నా. పురాణ్ కుమార్ ఒక అవినీతిపరుడైన పోలీసు. తన అవినీతి బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్ష సమస్యను ఉపయోగించి ఆ ఐపీఎస్ అధికారి వ్యవస్థను హైజాక్ చేశారు. అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత పురాణ్ కుమార్‌ను బదిలీ చేశాం. ఆయన గన్‌మెన్ మద్యం కాంట్రాక్టర్ నుంచి రూ. 2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా నేను పట్టుకున్నా. నేను ఆ గ్యాంగ్‌స్టర్ ను బెదిరించడంతో పురాణ్ కుమార్‌ను కలిశాడు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి రావడంతో కులం రంగు పూసే ప్రయత్నంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు' అని వివరించారు. 

Also Read :  శ్రీలీల షాకింగ్ సర్ప్రైజ్! ఎవరీ 'ఏజెంట్ మిర్చి'..?

ఇక నిజాయితీపరులైన పోలీసుల స్థానంలో అవినీతిపరులైన అధికారులను నియమించాడని సందీప్ కుమార్ చెప్పారు. ఈ వ్యక్తి పలు ఫైళ్లను బ్లాక్ చేసి, పిటిషనర్లకు ఫోన్ చేసి, డబ్బులు అడిగి వారిని మానసికంగా హింసించారు. బదిలీలకు బదులుగా మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా వేధించారు. అతని అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. తనపై వచ్చిన ఫిర్యాదుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుమార్ ఆరోపించారు. 

'ఇది కుల సమస్య కాదు. వారి ఆస్తులపై దర్యాప్తు చేయాలి. నిజం బయటకు రావాలి. అతను అవినీతిపరుడు. ఈ సత్యం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తున్నా. నేను నిజాయితీతో నిలబడినందుకు గర్వపడుతున్నా. దేశాన్ని మేల్కొల్పడం చాలా ముఖ్యం. నా కుటుంబ సభ్యులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఇక సందీప్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో పేరున్న 10 మంది అధికారులలో ఒకరైన రోహ్‌తక్ పోలీస్ చీఫ్ నరేంద్ర బిజార్నియాను ప్రశంసించడం విశేషం. 

Advertisment
తాజా కథనాలు