Afghanistan: పాక్‌ను ఓడించాం.. అఫ్గాన్‌లో మిన్నంటిన తాలిబన్ల సంబరాలు: వీడియో!

తాలిబన్లు పాకిస్తాన్‌పై విజయం సాధించామని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, నంగర్హార్, పంజ్‌షీర్‌లలో ప్రజలు వీధుల్లో్కి వచ్చి విజయోత్సవర్యాలీలు తీస్తున్నారు.

New Update
afgaaan (1)

Afgan: తాలిబన్లు పాకిస్తాన్‌(pakistan)పై విజయం సాధించామని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, నంగర్హార్, పంజ్‌షీర్‌లలో ప్రజలు వీధుల్లోకి వచ్చి విజయోత్సవర్యాలీలు తీస్తున్నారు. పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పిస్తామని, ప్రాణాలను పణంగా పెట్టైనా సరే తమ భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అఫ్గాన్‌ గడ్డపై పాకిస్తానీయుల దుష్ట దృష్టిని తాము సహించలేమని అక్కడి పౌరులు చెబుతున్నారు. ఈ పోరాటాన్ని పాకిస్తానీయులకు అఫ్గాన్ల బలమైన ప్రతిస్పందనగా అభివర్ణిస్తున్నారు. 

Also Read :  Gaza peace deal : గాజా శాంతి ఒప్పందం..పాక్‌ ఎందుకు వ్యతిరేకిస్తుందంటే?

Afghan Taliban Declare Defeat Of Pakistan

పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలో తమ సైన్యం చూపిన ధైర్యం ప్రశంసనీయం. అఫ్గానిస్తాన్(afganisthan) గగనతల చట్టాలను ఉల్లంఘించిన పాకిస్తాన్ చర్య భరించలేనిదని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అంటున్నారు .అఫ్గాన్‌ సైన్యానికి, తాలిబాన్ యోధులకు మద్దతు ఇవ్వడానికి యువత పెద్ద ఎత్తున కదిలివచ్చారు. పాకిస్తాన్ మన భూభాగాన్ని ఉల్లంఘించి ఉండకపోతే.. అఫ్గానిస్తాన్ వారిపై ఇలాంటి దాడులు చేయాల్సిన అవసరం ఉండేది కాదని కునార్ నివాసి దావూద్ ఖాన్ హమ్‌దార్ద్ అన్నారు. 'మేము సరిహద్దులను పంచుకుంటున్నాం. మా సంబంధాలు ఇంకా దెబ్బతినలేదు. కానీ ఇప్పడు ఎదురైన సమస్య మాతో కాదు. పాకిస్తాన్‌తో ఉంది. ఎందుకంటే పాక్ ఎల్లప్పుడూ సమస్యలకు మూలం' అంటూ అఫ్గాన్ కు చెందిన ఓ నాయకుడు చెప్పారు. 

ఇక దేశ గగనతల ఉల్లంఘనను సహించేది లేదని, దానికి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని తాలిబన్ గిరిజన పెద్దలు, మత పండితులు ప్రకటించారు. కునార్‌కు చెందిన గిరిజన పెద్ద తవోస్ ఖాన్ అఖుండ్జాదా మాట్లాడుతూ.. 'ఆఫ్గానిస్తాన్ సామ్రాజ్యాల స్మశానవాటిక. ఆఫ్గాన్  చరిత్ర నుంచి పాక్ పాఠం నేర్చుకుని ఆఫ్గాన్ లను వేధించడం మానేయాలి' అని హెచ్చరించారు. మరోవైపు తాజాగా పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన ప్రకటన చేశారు.  అఫ్గాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read :  ఆ దేశ అధ్యక్షుడిని తరిమికొట్టిన Gen-Z యువత.. మరో నేపాల్ కానుందా?

‘ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. శత్రుత్వాలు లేవని మీరు చెప్పొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి ప్రతికూలంగా ఉన్నాయి. నేటికి దానితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు.. బెదిరింపులతో కూడిన చర్చలు సరికావని వివరించారు.  బెదిరింపులపై చర్యల అనంతరం చర్చలకు అంగీకరిస్తామని తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు