Madagascar Gen Z protesters: ఆ దేశ అధ్యక్షుడిని తరిమికొట్టిన Gen-Z యువత.. మరో నేపాల్ కానుందా?

మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినాకు వ్యతిరేకంగా Gen-Z యువత నిరసనలు చేపట్టింది. దీంతో ఆండ్రీ దేశం విడిచి పారిపోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అతను దేశంలోనే ఉన్నారని, కాకపోతే ఎక్కడ ఉన్నారనే విషయం క్లారిటీగా తెలియదని తెలుస్తోంది.

New Update
Andry Rajoelina

Andry Rajoelina

నేపాల్‌లో Gen-Z నిరసనలతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయేలా చేశారు. అయితే ఇప్పుడు ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న ఒక ద్వీప దేశమైన మడగాస్కర్ మరో నేపాల్ కానుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే దాదాపుగా మూడు వారాల నుంచి యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేపట్టాయి. అధ్యక్షుడు ఆండ్రీ రజొలినా పదవి నుంచి దిగిపోవాలని తీవ్ర నిరసనలు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఆండ్రీ రజొలినా దేశం విడిచి పారిపోయారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. దాదాపుగా మూడు వారాల నుంచి జరుగుతున్న ఈ నిరసనలో ఎందరో ప్రజలు మృతి చెందారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల పక్షాన నిలిచిన మడగాస్కర్ సైన్యంలోని ఒక విభాగం మొత్తం సైన్యాన్ని స్వాధీనం చేసుకుంది. కొత్త సైనిక అధిపతిని కూడా నియమించింది. అయితే దీన్ని అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా ఖండించినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Third World War: ఇండియా-యూస్, పాక్-ఆఫ్ఘాన్, రష్యా-ఉక్రెయిన్ వార్.. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా?

వ్యతిరేక తిరుగుబాటు చేస్తుందని..

ఇతను అధ్యక్షుడు కావడానికి సహకరించిన బృందం ఇప్పుడు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుందని తెలిపారు. ఈ మడగాస్కర్‌లో సుమారు 30 మిలియన్లు దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం 1960- 2020 వరకు ఆ దేశ తలసరి GDP 45 శాతం తగ్గింది. అయితే సోమవారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. కానీ సైనికులు రాష్ట్ర ప్రసార సంస్థపై దాడి చేయడంతో అది వాయిదా పడింది. ప్రతిపక్ష నాయకుడు సితేని రాండ్రియానాసోలోనియాకో మాట్లాడుతూ రాజోలీనా ఆదివారం ఫ్రెంచ్ సైనిక విమానంలో దేశం విడిచి పారిపోయారని ఆరోపించారు. అయితే అధ్యక్షుడు ప్రస్తుతం మడగాస్కర్‌లోనే ఉన్నట్లు తెలిపారు. కానీ ఎక్కడ ఉన్నారనే విషయం తెలియదు. 

ఇది కూడా చూడండి: Pakistan - Afghanistan War: అఫ్గానిస్థాన్‌తో కటీఫ్‌...పాక్‌ సంచలన నిర్ణయం..

2009లో రాజోలినాను అధికారంలోకి తీసుకురావడంలో సహాయపడిన ప్రత్యేక సైనిక విభాగం CAPSAT. ఇది అన్ని సాయుధ దళాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఘర్షణల్లో ఒక సైనికుడు మరణించాడని కానీ తిరుగుబాటుకు పాల్పడినట్లు తాను చెప్పలేదని CAPSAT కమాండర్ కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా అన్నారు. ఈ నిరసనలు సెప్టెంబర్ 25న నీరు, విద్యుత్ కొరతపై నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇది చివరకు నిరసనగా మారింది. ఇలానే ఈ నిరసనలు కొనసాగితే.. మడగాస్కర్ మరో నేపాల్ కానుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు