చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్....క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు

పాకిస్తాన్ బోర్డ్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు క్యాసినోవాకు వెళ్ళడమే కాక గ్యాంబ్లింగ్ లో కూడా ఇన్వాల్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

New Update
చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్....క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు

పాకిస్తాన్ బోర్డు అనవసరమైన చిక్కులను నెత్తిన వేసుకుంది. శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ కు వచ్చిన పాక్ బోర్డ్ అధికారులు ఆరోపనలను ఎదుర్కొంటున్నారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు రూల్స్ ను అతిక్రమించారని చెబుతున్నారు. ఐసీసీ కోడ్ ప్రకారం మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు క్యాసినోవాలకు వెళ్ళడం, గ్యాంబ్లింగ్ చేయడం, ఆడడం నిషిద్ధం. కానీ అధికారులు ఇద్దరూ క్యాసినోవాకు వెళ్ళడమే కాకుండా గ్యాంబ్లింగ్ కూడా ఆడారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే పాక్ బోర్డ్ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. తామిద్దరం అక్కడకు కేవలం డిన్నర్ చేయడానికి మాత్రమే వెళ్ళామని వారు చెబుతున్నారు. దీని మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఒకవేళ కనుక బోర్డ్ అధికారులు గ్యాంబ్లింగ్ ఆడినట్టు తెలిస్తే మాత్రం శిక్ష కచ్చితంగా పడుతుంది. ఇంతకు ముందు 2015లో ఇలాంటి ఆరోపనలతోనే అప్పటి పీసీబీ మేనేజర్ మొయిన్ ఖాన్ సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్నారు.

మరోవైపు భారత్-పాక్ మ్యాచ్ కు మళ్ళీ వరుణుడు అడ్డుకట్ట వేశాడు. మ్యాచ్ మొదలవడానికి ముందే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం పడింది. కాసేపటికి తగ్గి...గ్రౌండ్ మీద ఉన్న కవర్లు తీసేద్దాం అనుకునే సమయానికి మళ్ళీ పడడంతో అంతరాయం ఏర్పడింది.

PCB Officials In Big Trouble After Breaking ICC Code Of Conduct

ఆసియా కప్ లో భారత్ -పాక్ మ్యాచ్ ఆడేట్టు కనిపించడం లేదు. మొదటి మ్యాచ్ వర్షం కారణంగానే ఆగిపోయింది. రెండో మ్యాచ్ కూడా అదే కారణంతో వాయిదా పడింది. ఆఖరికి ఈ రోజు రిజర్వ్ డే జరగాల్సిన మ్యాచ్ నుకూడా వరుణుడు అడ్డుకున్నాడు. ఇవాళ ఉదయం నుంచి కొలంబోలో వాతావరణం పొడిగఆ ఉంది. కానీ మ్యాచ్ మొదలయ్యే సమయానికి కొద్ది ముందు నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం డుతూనే ఉంది. మధ్యలో కొంతసేపు తెరిపి ఇచ్చి మ్యాచ్ జరుగుతుందని ఆశలు కల్పించింది కానీ మొదలెట్టకుండానే మళ్ళీ వాన పడింది. దీంతో గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పేశారు. ఎంతవరకు ఈ పరిస్తితి కొనసాగుతుందో, మళ్ళీ మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కూడా కష్టంగానే ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో 50-50 ఓవర్ల మ్యాచ్ జరగడం కష్టమే. కొంచెం సేపు అయ్యాక అయినా వర్షం తగ్గి...గ్రౌండ్ లో ఆడగలిగే పరిస్థితి ఉంటే డక్ వర్త్ లూయిస్ ప్రకారం 20-20 మ్యాచ్ అయినా ఆడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కుదరదు అంటే ఇక మొత్తం మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చేయాల్సిందే. నిన్న మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 24.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు