Pawan Kalyan: తండ్రికి ఉన్న గుణం కొడుక్కి లేదు కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదన్నారు. By Karthik 01 Oct 2023 in గుంటూరు రాజకీయాలు New Update షేర్ చేయండి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు మంచి చేస్తే జగన్ మోహన్ రెడ్డి మాత్రం పేదల రక్తాన్ని పీల్చుతున్నారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి అనుకున్నది సాధించే వరకు విశ్రమించని వ్యక్తి అన్నారు. కానీ జగన్ రాజశేఖర్ రెడ్డి ఫోటోతో ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మహిళల ఓట్లను దోచుకున్న జగన్.. ఇప్పుడు ఉన్న మద్యాన్ని నిషేధించడం పక్కన పెడితే కొత్త మద్యాన్ని రాష్ట్రంలో విక్రయిస్తూ మహిళల మెడలో తాలిబొట్లు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జే మద్యం, బుల్ బుల్ మద్యాన్ని సేవించడం వల్ల రాష్ట్రంలో అనేక మంది మరణించినట్లు జనసేన అధినేత గుర్తు చేశారు. 2019లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో చూసి ప్రజలు ఓట్లు వేశారన్న పవన్.. ఇప్పుడు జగన్ చేస్తున్న అరాచకాలు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలుపొందడం అసాధ్యమన్నారు. వైసీపీ ఎన్ని ఎత్తుగడులు వేసినా మళ్లీ సీఎం కాలేడని, ఛాన్స్ దొరుకుతుందో లేదో తెలియకనే జగన్ చంద్రబాబుపై ఉన్న కక్షను ఇప్పుడే తీర్చుకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ చంద్రబాబును అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశారన్న పవన్.. అందుకే పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు మద్దతు వస్తోందన్నారు. మరోవైపు పవన్ వారాహి విజయ యాత్రలో జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ALSO READ: మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా #pawan-kalyan #ycp #tdp #arrest #chandrababu #cm-jagan #janasena #krishna-district #ys-rajasekhar-reddy #warahi-yatra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి