/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/PAWAN-KALYAN-jpg.webp)
Janasena Chief Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. ఈరోజు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఏపీ అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. ఎన్డీయే (NDA) కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో (TDP) పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసేవారినీ, పార్టీ అంటే ఇష్టం ఉన్న వారినీ పోలింగ్ బూత్ వరకూ తీసుకువెళ్లే బాధ్యత నాయకులు తీసుకోవాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఉదారతతో కొంతమందికి పార్టీ టిక్కెట్లు ఇచ్చామని, అయితే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ప్రతి సీటు ముఖ్యమేనని నాయకులకు స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బలంగా ఎలక్షనీరింగ్ చేయాలని చెప్పారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలామంది ఉదాసీనంగా వ్యవహరించారని, ఈసారి అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దన్నారు.
టిక్కెట్ ఆశపడే అభ్యర్థులు వ్యక్తిగతంగా 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవల్సి ఉంటుందని, అలాంటి వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని తాను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రూ.40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని చెబుతుంటే, నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ (Zero Budget Politics) చేయాలని ఎలా చెబుతానానని నాయకుల వద్ద ప్రశ్నించారు. సభలకు వచ్చిన జనం.. పోలింగ్ బూత్ దగ్గర కనిపించాలనీ.. దీనికోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సన్నద్ధమై పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.
ALSO READ: ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాబోయే ఎన్నికల్లో ప్రతి సీటు కీలకమని.. అందువల్ల ప్రతి స్థానాన్ని గెలవడానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామనీ, నియోజకవర్గ స్థాయిలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీని(YSRCP) ఢీ కొడుతున్నామనీ చెబుతూ, తెలుగుదేశం పార్టీతో సయోధ్యతో ప్రయాణం చేసేవారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రచార విధానాలు అవలంబించాలి... ఎక్కడ సభలను నిర్వహించాలనే ఇతర అంశాలను నాయకులతో చర్చించారు.