TS: అడ్డగోలు అప్పులు.. దొంగ ఏడుపులు.. కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే: ఇందిరాశోభన్
పదేళ్ల కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలు అప్పులు, అసమర్థత, అణిచివేతలు తట్టుకోలేక ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పడు ఎంపీ సీట్లకోసం దొంగ ఏడుపులతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు.