Rohit Vemula : రోహిత్ మరణంపై అనేక ప్రశ్నలు.. కులంపైనే ఎందుకింత చర్చ!? హెచ్‌సీయూ స్టూడెంట్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు క్లోజ్ చేసినా ఇప్పటికీ అనేక ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. ఈ కేసు విచారణ మళ్లీ జరపాలంటూ రేవంత్ సర్కార్ కోర్టు మెట్లెక్కడంతో మరోసారి రోహిత్ కులం హాట్ టాపిక్ గా మారింది. By srinivas 05 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Suicide Mystery : ఒక మరణం.. వందల ప్రశ్నలు.. రోహిత్ వేముల(Rohit Vemula) ఆత్మహత్య కేసు క్లోజ్ చేసినా ఇప్పటికీ అనేక ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. అందుకే కాబోలు రేవంత్ సర్కార్(Revanth Sarkar) ఈ కేసు విచారణ మళ్లీ జరపాలని కోర్టు మెట్లెక్కింది. రోహిత్ వేముల అసలు దళితుడే కాదని పోలీసుల రిపోర్ట్ చెబుతోంది. అతను దళితుడేనని నివేదికలో స్టేట్మెంట్లు మాయం చేశారని రోహత్ వేముల కుటుంబం అంటోంది. అటు వామపక్ష అనుకూలిత విద్యార్థి సంఘాలు పోలీసులు రిపోర్ట్‌పై నిరసన బాటపట్టాయి. ఇంతకీ రోహిత్ వేముల కులమేంటి? చట్టం ప్రకారం ఒకరి కులాన్ని ధ్రువీకరించాల్సింది ఎవరు? తన అసలు కులం బయటపడుతుందన్న భయంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడా? అతని ఆత్మహత్య(Suicide) కు వివక్ష కారణం కాదా? లాంటి విషయాలు ఇవాళ తెలుసుకుందాం! బాల్యం గురించి తెలుసుకోవాల్సిందే.. అది 2016, జనవరి 17.. ఒక యువకుడు.. ఒక స్కాలర్ జీవితం అర్థాంతరంగా ముగిసింది. జీవితంలో బలహీన క్షణాలు ఆత్మహత్యలను ప్రేరేపిస్తాయి. రోహిత్ వేముల ఆత్మహత్యను అర్థం చేసుకోవాలంటే అతని బాల్యం గురించి తెలుసుకోవాల్సిందే అంటారు రోహిత్ చిన్ననాటి స్నేహితులు. వేముల గుంటూరు జిల్లాలో జనవరి 30,1989న మణికుమార్-రాధిక వేముల దంపతులకు రోహిత్ వేముల జన్మించాడు. అతని తండ్రి వడ్డెర కులానికి చెందినవాడు. ఇది OBC క్యాటగిరీ కిందకు వస్తుంది. అతని తల్లి రాధికది మాల కులం. ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్. అయితే పెళ్లైన కొన్నాళ్లకు రాధిక-మణికుమార్ విడిపోయారని హిందూస్థాన్ టైమ్స్ వెబ్సైట్ చెబుతోంది. తల్లి పెంపకంలోనే రోహిత్ పెరిగారట. విడిపోయిన తర్వాత రాధిక తన తల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ రాధిక ఓ పనిమనిషిలా నివసించారు. ఎన్నో కష్టాలు పడ్డారని.. ఇది రోహిత్‌పై తీవ్రంగా ప్రభావం చూపిందని రోహిత్ స్నేహితుడు రియాజ్ హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక గుంటూరులో మొదలైన రోహిత్ విద్యాభ్యాసం చివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు వెళ్లింది. సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్.. ముంబైలో పేలుళ్లు జరిపి నిండు ప్రాణాలు బలిగొన్న కేసులో యాకూబ్ మెమన్ను 2015లో దోషిగా నిర్ధారించింది సుప్రీంకోర్టు. అతనికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ శిక్షను వ్యతిరేకిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్-ASA ర్యాలీలు చేసిందని ఏబీవీపీ ఆరోపించింది. ఆ తర్వాత ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్ పెట్టిన ఓ సోషల్‌మీడియా పోస్ట్‌తో వివాదం ముదిరింది. ASA సభ్యులను గుండాలుగా సుశీల్ పోస్ట్ చేయగా అతనిపై దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన సుశీల్ కుమార్‌ను మదీనగూడలోని అర్చన హాస్పిటల్‌కు తీసుకెళ్ళగా పేగులు, కిడ్నీలకు తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో సంబంధమున్న విద్యార్థులను యూనివర్శిటీ సస్పెండ్ చేసింది. దీని కారణంగా వారికి రావాల్సిన స్కాలర్షిప్ ఆగిపోయింది. ఇది కూడా చదవండి: Rahul gandhi: రాహుల్ గాంధీ జీవితం అక్కడే మలుపు తిరిగిందా.. అందుకే పెళ్లి చేసుకోలేదా!? సస్పెండ్ అయిన విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా జనవరి 18, 2016న కోర్టు వాదనలు వినాల్సి వుంది. అందుకు ఒక రోజు ముందే అంటే జనవరి 17న రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ మరణం HCUలో తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. ఇది రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. అయితే రోహిత్ ఆత్మహత్య తర్వాత అతని కులంపై పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేశారు. అతనిది బీసీ కులమని.. అసలు దళితుడు కాదని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. చివరకు ఇదే నిజమని తేల్చి కోర్టులో రిపోర్టును సబ్మిట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచో సర్టిఫికెట్లు తెచ్చారంటూ.. మరోవైపు పోలీసులు రిపోర్ట్‌లో నిజం లేదంటున్నాయి దళిత వర్గాలు. ఎక్కడెక్కడి నుంచో సర్టిఫికెట్లు తెచ్చారంటున్నారు. రోహిత్ మాల కులానికి చెందినవాడని ప్రకటిస్తూ రెవిన్యూ అధికారులు ఇచ్చిన పత్రాన్ని పోలీసులు దాచిపెట్టారంటున్నారు. నిజానికి తల్లి, తండ్రి ఇద్దరి కులాల్లో ఎవరి కులాన్నైనా తమదిగా చెప్పుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం పౌరులకు కల్పించింది. ఆ అవకాశంతోనే రోహిత్ తల్లి కులాన్ని ఎంచుకున్నాడని దళిత వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల తల్లి రాధిక ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ఆమెకు సీఎం హామీ ఇచ్చారు. దీంతో కేసు దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. దర్యాప్తును కొనసాగించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారంలో వర్సిటీ వీసీతోపాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాల్లేవంటూ తాజాగా హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించగా మరోసారి ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. #telangana #rohit-vemula #suicide #cm-revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి