KCR : కేసీఆర్‌పై గౌరవం తగ్గలేదు! బీఆర్‌ఎస్ నుంచి చాలమంది నేతలు వెళ్లిపోయిన కూడా ఆ పార్టీకి ఎలాంటి నష్టం లేదని.. పార్టీ కేడర్ మాత్రం కేసీఆర్‌తోనే ఉందని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కొంతమేరకు ప్రభావం చూపించినా ఆయనకు ఇది విజయమేనని పేర్కొన్నారు. By B Aravind 27 Apr 2024 in Latest News In Telugu Opinion New Update షేర్ చేయండి Pentapati Pulla Rao : తెలంగాణలో 2023 డిసెంబర్ 3న కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. కేసీఆర్(KCR) పని అయిపోయిందని, ఆయన పార్టీ కనుమరుగవుతుందనే ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. సీఎం రెవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో.. ఎంతోమంది బీఆర్‌ఎస్(BRS) నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ఠను దిగజార్చి.. బీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీయడమే రేవంత్ లక్ష్యం. రేవంత్ ఒక చాకచక్యమైన రాజకీయ నేత. బీజేపీ వల్ల ముప్పు లేదని ఆయనకు అర్థమైంది. కానీ కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ వల్ల తనకు దీర్ఘకాలిక ముప్పు ఉందని తెలుసు. కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల అదృష్టం ఎప్పుడైనా మారవచ్చు. కాంగ్రెస్ ఫేవరేట్ లిస్టులో తనది శాశ్వత స్థానం కాదని రేవంత్ కు తెలుసు. అహ్మద్ పటేల్‌కు ఇందిరా గాంధీ కాలం నుంచి.. గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు రాజీవ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత 1988లో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి ఆమెకు దగ్గరయ్యారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉనేనప్పుడు కూడా.. అహ్మద్ పటేల్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. కానీ 2015 తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడైనప్పుడు.. అహ్మద్ పటేల్ పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. చివరికి 2020లో అహ్మద్ పటేల్ కరోనా బారిన పడి మృతి చెందారు. ఆయన చనిపోయినప్పుడు శవపేటిక వద్ద కాంగ్రెస్ నాయకులు లేరు. రేవంత్‌కు కాంగ్రెస్‌లో జరిగే అన్ని విషయాలు తెలుసు. Also Read: కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చాలా మంది బీఆర్‌ఎస్ పార్టీ నేతలను రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేర్చుకోగలిగాడు. వాళ్లలో కొంతమందికి ఎంపీ టికెట్లు ఇచ్చారు అలాగే మరికొంత మందికి భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, చాలా మంది నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో.. బీఆర్‌ఎస్ పార్టీ ఓ మునిగిపోతున్న ఓడనా అన్నట్లుగా అనిపించింది. చివరికి హైదరాబాద్ మేయర్ కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ నుంచి అనేక పదవులు పొంది.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. కేసీఆర్‌పై, తన కుటుంబంపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్లపై అవినీతి ఆరోపణలు, సవాళ్లు వస్తూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని రేవంత్ అంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్టవ్వడం కూడా కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీపై మరింత దుష్ప్రచారానికి కారణమైంది. కేసీఆర్ ఓ మునిగిపోతున్న ఓడ అన్నట్లుగా పరిస్థితులు వచ్చాయి. ఎలుకలే మునిగిపోయే ఓడ నుంచి దూకుతాయి. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అలాంటి చాలామంది నేతలు జంప్ అయిపోయారు. అయినప్పటికీ కేసీఆర్ విజయవంతంగా చేస్తున్న పర్యటనలు, బస్సు యాత్రల తర్వాత మళ్లీ ఆయన ఎదుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఈరోజు కేసీఆర్ స్థితి చాలామంది ధనిక, అవకాశవాదులు కేసీఆర్‌ను విడిచిపెట్టినట్లు కనిపిస్తోంది. కానీ పార్టీ కేడర్ ఇంకా కేసీఆర్‌తోనే ఉంది. నాయకులు వెళ్లిపోయి పార్టీలో గందరగోళం సృష్టించారు. అలాంటి నాయకులు దశాబ్దాలుగా పదవులు అనుభవించి, ఎప్పుడు సౌకర్యమని అనిపిస్తే.. అప్పుడు పార్టీలు మారారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కేడర్ మాత్రం వాళ్లని ఫాలో అవ్వలేదు. చాలామంది ఆధిపత్య వర్గాలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలే కేసీఆర్‌ను వదిలి వెళ్లిపోయారు. అందులో చాలామంది అధికారం కోసం పాకులాడే వాళ్లే ఉన్నారు. అలాంటి వాళ్లకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందింది. సాధారణ పార్టీ కార్యకర్తలు ఎక్కడికి వెళ్లలేమని గ్రహించారు. కేసీఆర్‌తోనే ఉండిపోయారు. సీఎం రేవంత్ సాధారణ కార్యకర్తలను ఎందుకు ఆహ్వానిస్తారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ పార్టీలు. ఆ పార్టీల నాయకులు సాధారణ కార్యకర్తలకు కనిపించరు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థతి ఉండదు. అందుకే ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ మనుగడ సాగిస్తాయి. కేసీఆర్ దూరంగా వెళ్లిపోతున్నారనే ప్రశ్నే లేదు. కేసీఆర్ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించడం అవసరం కేసీఆర్‌కు ఉన్న మరో ప్రయోజనం ఏంటంటే.. అసలైన పార్టీ కేడర్ ఆయనతోనే ఉంది. కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నుంచి కొత్త నాయకులు రావడంతో.. తమకు పక్కన పెడుతున్నారని పాత కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తమకు అధికారాన్ని పంచుకోవడంలో ఎలాంటి పాత్ర ఉండడం లేదని అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లు సైలంట్‌గా కాంగ్రెస్‌కు సహకరించడం లేదు. ఇప్పుడు అదే కేసీఆర్‌కు ఉపయోగపడుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌కు కొంత ప్రభావం చూపించడం అవసరం. తెలంగాణలో 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్‌కు ఇద్దరు లేదా ముగ్గురు ఎంపీలు గెలవడం అవసరం. ఒకవేళ అలా గెలవకపోయినా కూడా.. ఆయన మంచి ఓట్ షేరింగ్ తెచ్చుకున్నా పర్వాలేదు. 25 శాతం కన్నా ఓటింగ్ వస్తే అది పెద్ద విజయమే. Also read: రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మరోవైపు రేవంత్ 14 ఎంపీ సీట్లు గెలుచుకోవాలి. లేకపోయే ఆయన ఫెయిల్ అయినట్లే. ఒకవేళ బీజేపీ ఆరు లేదా అంతకన్నా ఎక్కువ ఎంపీలను గెలుచుకోనట్లేతే.. రాష్ట్రంలో ఇక ఈ పార్టీ పెరగదని అర్థం. కేసీఆర్ ఈ ఎన్నికల్లో కొంతమేర ప్రభావం చూపించడం అవసరం. అలాగే 1967 నుంచి కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా కనుమరుగైపోలేదు. కానీ వాటి ప్రభావం తగ్గిపోయి ఉండొచ్చు. ఒక ప్రాంతీయ పార్టీకి ప్రమాదం మరో ప్రాంతీయ పార్టీయే. కానీ తెలంగాణలో కేసీఆర్ పోటీగా ఏ ప్రాంతీయ పార్టీ లేదు. కేసీఆర్ ఇలానే ముందుకు కొనసాగితే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ముప్పు తప్పుదు. పెంటపాటి పుల్లారావు రాజకీయ విశ్లేషకులు #bjp #brs #telangana-news #pentapati-pulla-rao #telugu-news #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి