movies:నయనానందం...పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్

ఇన్ని రోజులుగా తమ పిల్లల ముఖాలను సస్పెన్స్ లో పెట్టిన నయన్, విఘ్నేష్ దంపతులు.. తాజాగా తమకు పుట్టిన కవలలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పటివరకూ అరకొరా తన పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ జంట...తాజాగా పూర్తిగా ముఖాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు.

New Update
movies:నయనానందం...పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. పెళ్ళయి, పిల్లలు వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేస్తున్న నయన్ తాజాగా బాలీవుడ్ చిత్రం "జవాన్" సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

nayanatara kids

అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ తాజాగా బాలీవుడ్... అన్నిటిలోనూ తన సత్తా చాటుకుంటూ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది నయనతార. ప్రస్తుతం భారీ స్టేటస్ సంపాదించుకున్న నయనతార... కెరీర్ ప్రారంభంలో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసింది. చాలా కష్టపడింది. యాంకరింగ్ కూడా చేసింది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్థాయికి చేరింది. అటు విఘ్నేశ్ కూడా కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం జవాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నయనతార.. తాజాగా తన ఇద్దరి పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. విఘ్నేశ్, నయన్ ల కవల పిల్లల ఫస్ట్ బర్త్ డే నేడు. ఈసందర్భంగా తీయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే గతంలో కూడా తన కవలలతో ఉన్న ఫోటోను నయన్ పెట్టినప్పటికీ ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కనిపించినా సగం సగం మాత్రమే ఉండేవి. ఇప్పుడు షేర్ చేసిన పిక్ లో మాత్రం పిల్లలిద్దరూ క్లియర్ గా, క్యూట్ గా కనిపిస్తున్నారు.

publive-image  nayanatara kids

ఇక ఫోటోలకు ఎన్ ముకక్ కొండ ఎన్ ఉయిర్... ఎన్ గుణం కొండ ఎన్ ఉలక్... అని క్యాప్షన్ జత చేశారు. మా కవల పిల్లల ఫోటోను పోస్ట్ చేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము అంటూ తన ఆనందాన్ని తెలియజేశారు. నాన్న, అమ్మ మిమ్మల్ని మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నారని కూడా నయనతార, విఘ్నేశ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ద్వారా పేర్కొన్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కంగ్రాట్స్, విషెస్ చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు