/rtv/media/media_files/2025/05/18/54KSbKnmaMCTYtxEZPkP.jpg)
Central Jail Salem
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న మాదకద్రవ్యాల రవాణా అరికట్టలేకపోతుంది. నిందితులు ఏదో మార్గంలో తమ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా చెన్నై సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం సృష్టించాయి. సేలం సెంట్రల్ జైలులో ఉన్న స్నేహితుడైన ఓ ఖైదీకి గంజాయి ఇవ్వడానికి వచ్చి ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. స్నేహితునికి గంజాయి ఇవ్వడానికి బిస్కట్ ఫ్యాకేట్‌లో గంజాయి తీసుకువచ్చి ఆ యవకుడు పోలీసుల చేతికి చిక్కాడు.
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
Marijuana Biscuits In Central Jail
బిస్కెట్ ఫ్యాకేట్ ఓపెన్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన జైలు సిబ్బంది దాన్ని తనిఖీ చేశారు. అయితే బిస్కట్ల మధ్యలో గంజాయి పెట్టి ఖైదీకి ఇవ్వడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. బిస్కె్ట్లలో గంజాయి తరలించడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. బిస్కెట్లకు మధ్యలో రంధ్రం చేసి వాటిలో గంజాయి పెట్టి తిరిగి ప్యాక్ చేసి తీసుకొచ్చాడు ఆ యువకుడు. దీంతో దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బిస్కెట్ ప్యాకెట్‌లో దాచిన 80 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
కాగా గంజాయి సరఫరా యత్నించిన మమ్మద్ సుకిల్ అనే యువకున్ని జైలు సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కాగా గంజాయి అలవాటు ఉన్న తన స్నేహితుడికి గంజాయి కావాలని అడగడం వల్లే తను గంజాయి తీసుకొచ్చినట్లు సదరు యువకుడు అంగీకరించాడు. సేలం సెంట్రల్ జైలులో వెయ్యి మందికి పైగా ఖైదీలు ఉంటారు. అయితే అక్కడ గట్టి భద్రత ఉన్నప్పటికీ, వారిలో కొందరు సెల్ ఫోన్లు, గంజాయి వంటి మాదకద్రవ్యాలను ఉపయోగించడం కలకలం సృష్టిస్తుంది.
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
Also Read : ఏసీ కంప్రెసర్ పేలడంతోనే అగ్ని ప్రమాదం.. దీనికి గల కారణాలేంటి?
Ganja Issue | ganja | chennai | jail | central-jail | Salem Tamil Nadu