/rtv/media/media_files/2025/01/03/VMPqHMFtNYVoVsOYBASC.jpg)
Plane Crash California Photograp
California: అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం.. చిన్న విమానం ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న ఓ భవనంపై పడింది. విమానం పడిన ప్రాంతంలో ఇంటి పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది. ఆ తర్వాత విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
గిడ్డంగి పైకప్పుపై కూలిన విమానం:
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం 2:10 గంటలకు దక్షిణ కాలిఫోర్నియా గిడ్డంగి పైకప్పుపై ఒక్కసారిగా విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. కనీసం 18 మంది గాయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన జరిగినట్లు మొదట స్ట్రక్చర్ ఫైర్ సంస్థ వెల్లడించింది. విమానం కూలిన తర్వాత దానిలో మంటలు చెలరేగాయి. ఈ చిన్న విమానం ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఇంటిపై పడింది. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో...వెంటనే ప్రమాదానికి గురైన గోదాం దగ్గరకు చేరుకుని లోపల మంటలను అదుపు చేశారు. విమాన ప్రమాదం జరగటంతో సమీపంలోని భవనాలను ఖాళీ చేయించారు అధికారులు.
pic.twitter.com/BHcUOT2wUE
— RK Gold (@RKGold) January 3, 2025
This video shows the actual impact and resulting fireball from the plane crash in Fullerton California.
లాస్ ఏంజెల్స్‌కు ఆగ్నేయంగా 25 మైళ్ల దూరంలో ఈ విమానం కూలిపోయిన స్థలం ఉంది. ఈ విమానం కూలిపోయిన భవనం.. ఫర్నిచర్ తయారీ కంపెనీ భవనంగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో కార్మికులు సహా అనేక మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయపడినట్లు ఫుల్లర్టన్ పోలీసులు వెల్లడించారు. గాయ పడిన క్షతగాత్రులను వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: శబరిమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మందికి