Pushpa 2 box office collections: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ ర్యాంపేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రికార్డు బ్రేకింగ్ థియేట్రికల్ రన్ తో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తోంది. బుక్ మై షోలో 19.5మిలియన్ టికెట్ విక్రయాలతో బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా నాలుగు వారాల కలెక్షన్స్ రిలీజ్ చేశారు. Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..! నాలుగు వారాల్లో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు వైల్డ్ ఫైర్ పుష్ప 2 నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1799 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా నార్త్ లో పుష్ప హవా ఎక్కువగా కొనసాగుతోంది. బాలీవుడ్ లో ఇప్పటివరకూ ఏ హిందీ వెర్షన్ సినిమా సాధించని విధంగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో రూ. 2000 కోట్ల క్లబ్ లోకి చేరే దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో 'పుష్ప2' రూ.2వేల కోట్ల కలెక్షన్ల మార్కును దాటుతుందా?అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఇదే జరిగితే 2000 కోట్లు రాబట్టిన అమీర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన రెండవ భారతీయ చిత్రం 'పుష్ప 2' అవుతుంది . #Pushpa2TheRule is RULING THE INDIAN BOX OFFICE with its record breaking run 💥💥The WILDFIRE BLOCKBUSTER GROSSES 1799 CRORES WORLDWIDE in 4 weeks ❤🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/rZUWgCJAZB — Pushpa (@PushpaMovie) January 2, 2025 Also Read: Armaan Malik: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్