/rtv/media/media_files/2025/04/28/sSJKS5oznOZy11Po9IBs.jpg)
Revamth Vs KCR
నిన్నటి కేసీఆర్ స్పీచ్ లో పస లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడన్నారు.కేసీఆర్, మోదీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని ఆరోపించారు.ప్రపంచంలో ఇంధిరా గాంధీకి మించిన యోధురాలు లేరన్నారు. ఓక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీ దేనన్నారు. తాను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చట్టప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. తనకు, రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందన్నారు. ఈ విషయమై ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీం లు ఏ రాష్ట్రంలో అమలు లో లేవన్నారు. ఎన్నికలకు ముందు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందన్నారు.
ఇది కూడా చదవండి: KCR: అధికారం పోగానే నక్సలైట్లు గుర్తుకొచ్చారా.. కేసీఆర్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్!
సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్..
— Telangana Awaaz (@telanganaawaaz) April 28, 2025
నేను ఇంకా ఇరవై ఏండ్లు రాజకీయాల్లో ఉంటాను..
నేను చట్టప్రకారమే నడుచుకుంటాను..
అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని అరెస్ట్ చేయలేను..
నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా..
అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను. ఇప్పించాను..
చేసిన పనులు… pic.twitter.com/QOaTsmKJfL
కగార్ పై జాతీయ స్థాయిలో చర్చ..
కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆకాంక్షించారు. కగార్ పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు. ఏడాదిన్నర నుంచి అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. అ0రెస్టులు చేయమని డిమాండ్ వస్తోందన్నారు. తాను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని స్పష్టం చేశారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి.. ఇప్పించానన్నారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుక పడ్డామన్నారు. దీన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామన్నారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. కారణం అదేనా!?