/rtv/media/media_files/2024/11/27/8HItpSAfsdNr9lk1CRzo.jpg)
మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. దీంతో ఇండియా కూటమిలో భేధాభిప్రాయలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తృణముల్ కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమిలో చీలకలకు సంకేతాలిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అలాగే కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
Also read: లవర్స్ మధ్య చిచ్చు పెట్టిన నాన్ వెజ్.. ఒకరు మృతి.. అసలేమైందంటే?
మొదటినుంచే ఇండియా కూటమిపై మమతా బెనర్జీ ప్రభుత్వం అంసతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. తాజాగా టీఎంసీ నేతలు వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై టీఎంసీ నేతలు విమర్శలు చేశారు. మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి తాము రబ్బర్ స్టాంప్ కాదని అన్నారు. పార్లమెంటులో పశ్చిమ బెంగాల్ ప్రజల సమస్యలను లేవనెత్తేలా సభను నిర్వహించాలని కోరారు. దేశంలో జరుగుతున్న అవినీతిపై పార్లమెంటులో చర్చ కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రజల కోసం తాము చర్చ కొనసాగించాలని కోరుతున్నామని టీఎంసీ స్పష్టం చేసింది.
Also Read: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు'
ప్రస్తుతం బెంగాల్‌కు నిధుల కొరత ఉందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయని, వీటి గురించి పార్లమెంటులో చర్చించాలని అనుకుంటున్నామని టీఎంసీ నేతలు చెప్పారు. ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికల్లో, పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఉపఎన్నికల్లో ఆరు స్థానాలు, లోక్‌సభ ఎన్నికల్లో 40 నియోజకవర్గాల్లో 29 స్థానాలను సొంతం చేసుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోవడంపై టీఎంసీ విమర్శలు చేయడం చర్చనీయమవుతోంది.
Also Read: కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి: బీజేపీ నేత
ఇది కూడా చదవండి: RGV Reaction: దయచేసి అర్థం చేసుకోండి.. RGV మరో సంచలన వీడియో!