లవర్స్ మధ్య చిచ్చు పెట్టిన నాన్ వెజ్.. ఒకరు మృతి.. అసలేమైందంటే? నాన్ వెజ్ తింటుందని బాయ్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఓ పైలట్ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌కి చెందిన తులి అనే యువతి ఎయిరిండియాలో ఉద్యోగం చేస్తోంది. బాయ్‌ఫ్రెండ్ వేధింపులకు తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. By Kusuma 27 Nov 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ఇద్దరి లవర్స్ మధ్య నాన్ వెజ్ పెద్ద చిచ్చు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన సృష్టి తులి, ఢిల్లీకి చెందిన ఆదిత్య పండిట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ సమయంలో ఢిల్లీలో పరిచయమ్యారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తులికి నాన్ వెజ్ అంటే ఇష్టం. ఆదిత్యకి వెజ్ అంటే ఇష్టం. అయితే శిక్షణ పూర్తయిన తర్వాత తులి ఎయిరిండియాలో ఉద్యోగం రావడంతో ముంబై వెళ్లింది. ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం మనస్థాపానికి గురై.. నాన్ వెజ్ అంటే నచ్చని ఆదిత్య ఎప్పుడూ తులితో గొడవ పడుతూనే ఉంటాడు. కేవలం ఆమె ఉన్నప్పుడే కాకుండా అందరూ ఉన్నప్పుడు కూడా తులిని తిట్టేవాడు. ఇలా పలుమార్లు నాన్‌వెజ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె చివరకు తీవ్ర మనస్తాపానికి గురై ముంబైలోని మారోల్ పోలీస్ క్యాంప్ దగ్గర ఆత్మహత్య చేసుకుంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. ! ఆదిత్య వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని తులి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదిత్యను అరెస్ట్ చేశారు. నాన్ వెజ్ విషయంలో పబ్లిక్‌లోనే తనతో ఎన్నో సార్లు గొడవపడ్డాడు. ఓసారి పార్టీలో తులి నాన్ వెజ్ తిన్నాదని ఆమెపై దాడి చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి! ఇదే కాకుండా ఆదిత్య సోదరి ఎంగేజ్‌మెంట్‌కి వెళ్లలేదని తులిని ఇంకా మానసికంగా వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కూతురు మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలోకి మునిగిపోయారు. గోరఖ్‌పూర్‌కి చెందిన తులి మొదటి మహిళా పైలట్ కూడా. దీంతో ఉత్తరప్రదేశ్ సీఎం ఆమెను సత్కరించారట. ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు #non-veg #crime-news #mumbai lady pilot #air india pilot suside #sucide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి