/rtv/media/media_files/2025/11/14/nitish-2025-11-14-16-35-50.jpg)
Who will be Bihar Chief Minister? JD(U)'s post, now deleted
బీహార్‌లో ఈసారి కూడా ఎన్డీయే అధికారంలోకి రానుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఈసారి బీహార్ సీఎం ఎవరూ అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మళ్లీ నితీశ్ కుమార్ సీఎంగా ఎన్నికైతే 10వ సారి ప్రమాణస్వీకారం చేసిన నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ఈ ఎన్నికల్లో జేడీయూ కన్నా బీజేపీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈసారి బీజేపీ అభ్యర్థి కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.
Also read: సొంత పార్టీకి పని చేయని ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ.. బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ గల్లంతు
ఈ నేపథ్యంలో తాజాగా జేడీయూ తమ అధికారిక ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేసింది. నితీష్ కుమారే మా సీఎం అని రాసుకొచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఆ పోస్టును డిలీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా నితీశ్ కుమార్ సీఎం అని అధికారికంగా ప్రకటించలేదు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సీఎం అయ్యే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. అయితే జేడీయూ ఆ పోస్టును డిలీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిబట్టి చూస్తే ఈసారి బీహార్‌లో సీఎం మార్పు ఉండే అవకాశాలు ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్యుత్.. తేజస్వీకి షాక్ ఇచ్చిన బీహారీలు
Follow Us