/rtv/media/media_files/2025/11/14/prashant-kishor-2025-11-14-15-24-50.jpg)
ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికలు, ఎన్నికలు అంటే ప్రశాంత్ కిషోర్‌గా పేరు తెచ్చుకున్న పొలిటికల్ స్ట్రాటజిస్ పీకే. గతంలో దాదాపు 10 రాష్ట్రాల్లో ఆయన వివిధ పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి పని చేశారు. తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 సొంతం రాష్ట్రంలో రాజకీయ అరంగ్రేటం చేశారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ బీహార్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్నారు. కానీ తన సొంత పార్టీ 'జన్ సురాజ్' అసెంబ్లీ ఎన్నికల అరంగేట్రంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తాజా ఓట్ల లెక్కింపు ట్రెండ్స్‌లో, ఈ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేక, సున్నాకే పరిమితమైంది. జన్ సురాజ్ పార్టీ మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 200లకు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ప్రారంభ రౌండ్లలో కేవలం ఒకటి లేదా రెండు నియోజకవర్గాల్లో కొద్దిసేపు ముందంజ వేసినప్పటికీ, ఆ తర్వాత ప్రధాన కూటములైన ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ (MGB) అభ్యర్థుల నుంచి ఎదురైన బలమైన పోటీని తట్టుకోలేకపోయింది.
రాష్ట్రంలోని సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా 'నూతన రాజకీయాలు' తీసుకురావాలని పీకే 'జన్ సురాజ్'ను ప్రకటించారు. పార్టీ ఆవిర్భావానికి ముందు, సుదీర్ఘంగా 'జన్ సురాజ్ పాదయాత్ర' నిర్వహించడం ద్వారా విద్య, ఉపాధి, వలసలు, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఈ చైతన్యాన్ని ఓట్ల రూపంలోకి మార్చడంలో విఫలమయ్యారు.
చాలా నియోజకవర్గాల్లో జన్ సురాజ్ అభ్యర్థులు మూడవ లేదా నాల్గవ స్థానాలకే పరిమితమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో వీరు 10% వరకు ఓట్లను సాధించినా, అది గెలుపుకు సరిపోలేదు. అయితే, ఈ ఓట్లు ప్రధాన కూటముల్లో ఏదో ఒక పార్టీకి పడే అవకాశం ఉండగా, అవి చీలిపోవడం ఎన్నికల ఫలితాలపై స్వల్ప ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow Us