J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'

జమ్మూ కాశ్మీర్‌‌ టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27మంది మృతి చెందారు. పర్యటకులను వరసులో నిల్చేబెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి జరిపారని ఓ మహిళ తెలిపారు. తన భర్త పేరు, మతం అడిగిన ఉగ్రవాదులు అతనిపై కాల్చి చంపారని ఆమె చెప్పారు.

New Update
Manjunath

J&K Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. పర్యాటకులనే టార్గెట్‌గా చేసుకొని ఈ అటాక్ జరిగింది. టూరిస్టుల వరసులో నిల్చేబెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారని ఓ మహిళ తెలిపారు. కర్ణాటకకు చెందిన జంట పల్లవి భర్త పేరు, మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు మంజునాథ్‌పై కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. ఈ దాడిలో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమ్మర్ వెకేషన్ కోసం వారు జమ్మూ కాశ్మీర్ వచ్చారు.

Also Read :  ఉగ్రదాడి.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలను పట్టించుకోలేదా ?

Also read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

ముంబై ఉగ్రదాడుల తర్వాత ఎక్కువ మంది పౌరులు చనిపోయిన దాడి

ది రెసిస్టెంట్ ఫ్రంట్(TRF) అనే ఉగ్రవాద సంస్థనే దాడి చేసినట్లు ప్రకటించింది. ఇండియన్ ఆర్మీలా యూనిఫాంలో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఎక్కువ మంది పౌరులు చనిపోయిన దాడి ఇదే. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో తమిళనాడు,ఒడిశా,గుజరాత్, మహారాష్ట్ర,కర్నాటకకు చెందిన టూరిస్ట్‌లకు గాయాలయ్యాయి.

Also read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. అమర్‌నాథ్ యాత్ర భద్రత గురించి ప్రశ్నలు తలెత్తాయి. 38 రోజుల పాటు కొనసాగే అమర్‌నాథ్‌ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. ఎత్తైన కొండలు లోయల్లో ఉన్న సంఘటనా స్థలానికి చేరుకోవాలంటే గుర్రాల మీదనే వెళ్లడం సాధ్యం. వాహనాలు అక్కడికి వెళ్లడం కష్టం. దీంతో సైన్యం గాయపడిని వారిని కాపాడటానికి హెలికాఫ్టర్ వినియోగిస్తున్నారు.

Also read: BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

(terror-attack | Pahalgam attack | jammu-and-kashmir | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు