/rtv/media/media_files/2025/04/23/W9eVxpNQXzwvOv3Pg9Ft.jpg)
Amit shah
పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఈ ఉగ్రదాడి కదలికలపై ముందే హెచ్చరించినా కూడా అధికారులు దీన్ని ఆపడంలో విఫలమయ్యారా ? అనే సందేహాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 10న కేంద్ర హోం సెక్రటరీ గోవింద్ మోహన్ అధ్యక్షతన జమ్మూకశ్మీర్‌లో ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 6న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జమ్మూకశ్మీర్ యూనిఫైడ్ కమాండ్‌తో భేటీ అయ్యారు.
రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ సమావేశాలు జరిగినా.. జమ్మూకశ్మీర్‌లో హాట్ సమ్మర్ (రక్తపాతం) సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని హెచ్చరించడమే వీటి ఉద్దేశ్యం. జమ్మూలో భద్రతను సీఎం నేతృత్వంలోని యూనిఫైడ్ కమాండ్ చూసుకుంటోంది. అయితే మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న పర్యాటక ప్రాంతమైన బైసరన్ ఉగ్రవాదులకు టార్గెట్‌గా మారింది.
Also Read: 15 ఏళ్ళు...11 దాడులు..227 మంది మృతి..జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల విధ్వంసం
దాదాపు 4 నుంచి 6 గురు ఉగ్రవాదులు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. వీళ్లలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలస్తోంది. వీళ్లు బిద్‌బెహ్రా, త్రాల్ ప్రాంతాలకు చెందినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదుల్లో ఒకరు బాడీ కెమెరా కూడా ధరించినట్లు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పహల్గాం దాడికి ముందు పాకిస్థాన్ ఉగ్ర సంస్థ కమాండర్ ఒకరు బహిరంగ సభలో మాట్లాడుతూ కశ్మీర్‌లో రక్తపాతం సృష్టించాలని పిలుపునిచ్చాడు. అలాగే ఏప్రిల్ 18న పీవోకేలోని లష్కరే తోయిబా ఉగ్రవాది అబు ముసా కూడా భారత సైనిక దళాలలకు సవాలు చేశాడు.
Also Read: ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు
మరోవైపు ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లో దాదాపు 70 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడి.. సరైన ఆదేశాలు వచ్చేదాకా సాధరణ పౌరుల్లాగే వాళ్లు జీవిస్తున్నారు. అయితే శీతాకాలం ముగియడం వల్ల మంచు కరగడంతో ఉగ్రవాదులు పర్వాతాల పైనుంచి బైసరన్ లోయలోకి వచ్చి కాల్పులు జరిపినట్లు అధికారులు భావిస్తు్న్నారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా చుట్టుముట్టేశాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధం !
Also Read: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?
rtv-news | Pahalgam attack | national-news | telugu-news