/rtv/media/media_files/2025/04/22/JKuK3XmBqtTzT049Vfy4.jpg)
attack jammu
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్ లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా. పర్యాటకులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
దాడికి పాల్పడింది మేమే : టీఆర్ఎఫ్
ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో తమిళనాడు,ఒడిశా,గుజరాత్, మహారాష్ట్ర,కర్నాటకకు చెందిన టూరిస్ట్‌లకు గాయాలయ్యాయి. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. అమర్‌నాథ్ యాత్ర భద్రత గురించి ప్రశ్నలు తలెత్తాయి. 38 రోజుల పాటు కొనసాగే అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు.
మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిని ప్రధాని మోదీ ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. తగిన చర్యలు తీసుకోవాలని షాకు సూచించారు. ఘటనాస్థలానికి వెంటనే వెళ్లాలని అమిత్ షాకి మోదీ ఆదేశాలు జారీ చేశారు. మోదీ కూడా జమ్ముకశ్మీర్‌లోని ఘటనాస్థలానికి వెళ్లనున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడిని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని ట్వీట్ చేశారు.
#BREAKING : Union Home Minister Amit Shah left for #Pahalgam in #Kashmir , will take stock of the situation there and inform the PM MODI#JammuKashmir #PahalgamTerrorAttack #pahalgamattack #AmitShah #NarendraModi pic.twitter.com/y6KDFhWJ1u
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 22, 2025