J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

అప్పుడే పెళ్లైన జంట హనీమూన్ కోసమని జమ్మూ కాశ్మీర్‌ కు వచ్చారు. కానీ అదే వారిని వీడదీస్తుందని అనుకోలేదు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా ఉగ్రవాదులు ఆమె భర్తను పాయింట్ బ్లాక్ లో కాల్చారు.  కళ్లముందే  భర్త చనిపోవడం చూసిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.

New Update
jk-attack

jk-attack

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌ లో  హృదయ విదారక వీడియో బయటపడింది, మంగళవారం బైస్రాన్ ప్రాంతంలో ఆర్మీ డ్రెస్  ధరించిన  ఏడుగురు  ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడంతో దాదాపుగా ఐదుగురు మరణించగా పన్నెండు మంది గాయపడ్డారు. ఈ ఘటనలో కట్టుకున్న భర్తను కోల్పోయిన ఓ నవవధువు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హనీమూన్ కోసమని

అప్పుడే పెళ్లైన జంట హనీమూన్ కోసమని జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ కు వచ్చారు. కానీ అదే వారిని వీడదీస్తుందని అనుకోలేదు.  సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా.. ఉగ్రవాదులు ఆమె భర్తను పాయింట్ బ్లాక్ లో కాల్చారు.  కళ్లముందే  కట్టుకున్న భర్త చనిపోవడం చూసిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. జరిగిన ఘటనతో  ఆమెకు నోట నుంచి మాట రాలేదు.  భర్త ప్రాణం బతికే ఉంటాడన్న కొద్దీ ఆశతో నా భర్తను కాపాడండి అంటూ  ఆమె  వేడుకుంది. దయచేసి ఎవరైనా అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లండంటూ కేకలు వేసింది.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్  మీడియాలో వైరల్ గా మారాయి.  

jammu-and-kashmir | J&K Terror Attack | Tourist Woman | tourists | viral-video

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు