Bali Boat Capsized: బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు

ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపం బాలిలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 65 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందిని రక్షించగా.. 38 మంది కోసం రెస్క్యూ టీం వెతుకుతుంది. 

New Update
Bali Boat Capsized

Bali Boat Capsized

ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపం బాలిలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మొత్తం 65 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న KMP తును ప్రతామ జయ అనే పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందిని రక్షించగా.. 38 మంది కోసం రెస్క్యూ టీం వెతుకుతుంది. 

Also Read: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం

Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

Bali Boat Capsized

బుధవారం రాత్రి తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుండి బయలుదేరిన దాదాపు అరగంట తర్వాత KMP తును ప్రతామ జయ అనే బోటు మునిగిపోయిందని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పడవ బాలిలోని గిలిమనుక్ ఓడరేవు వైపు 50 కిలోమీటర్ల దూరం వెళుతోంది. 

Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

రెస్క్యూ ఏజెన్సీ ప్రకారం, ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 14 ట్రక్కులు సహా 22 వాహనాలు ఉన్నాయి. బన్యువాంగి పోలీసు చీఫ్ రామ సమతమ పుత్ర మాట్లాడుతూ.. రెస్క్యూ టీం ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను కనుగొన్నారని.. మరో 23 మందిని రక్షించారని చెప్పారు. వీరంతా నీటిలో మునిగిపోయిన తర్వాత అపస్మారక స్థితిలో కనిపించారని తెలిపారు. ఈ ఘటన రాత్రి 11:20 గంటలకు జరిగినట్లు అంచనా వేశారు. 

Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!

boat-capsized

Advertisment
Advertisment
తాజా కథనాలు