/rtv/media/media_files/2025/08/15/historic-building-collapses-in-delhi-2025-08-15-18-26-56.jpg)
Historic building collapses in Delhi
BIG BREAKING: భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ రోజు భారీ వర్షాల మూలంగా ఢిల్లీలోని ఓ చారిత్రక కట్టడం ప్రాంగణంలోఉన్న దర్గా కుప్పకూలింది. నిజామూద్దీన్ ప్రాంతంలోని మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి సమీపంలో ఉన్న దర్గా పైకప్పు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద పలువురు పర్యాటకులు చిక్కుకున్నట్లు సమాచారం. ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.శిథిలాల కింద 9 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | Delhi | Portion of the roof of a room at Dargah Sharif Patte Shah, located in the Nizamuddin area, collapses; Police and Fire Department personnel on the spot; Area cordoned off pic.twitter.com/dMAEcJrlQn
— ANI (@ANI) August 15, 2025
ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని హుమాయున్ సమాధి కాంప్లెక్స్ లోపల ఉన్న ఒక గది గోడలో ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో 9 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే 5 అగ్నిమాపక శకటాలను సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చారిత్రక కట్టడం 16వ శతాబ్దం మధ్యలో నిర్మించింది. ఇది దేశంలోని పర్యాట ప్రాంతాలలో ఒకటిగా బాగా ప్రాచుర్యం పొందింది.
ఇది కూడా చూడండి: Crime News: అనకాపల్లిలో అమానుషం.. గర్భిణిని చంపి.. శవాన్ని కాల్చి..!
కాగా వక్ఫ్ బోర్డు న్యాయవాది ముజీబ్ అహ్మద్ మాట్లాడుతూ ఈరోజు శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చారని తెలిపారు. కాలనీ ప్రజలతో పాటు బయటి వ్యక్తులు కూడా ప్రార్థనల కోసం వస్తారన్నారు. అయితే ఆరుబయటే ప్రార్థనలు చేసేవారని, కానీ ఈరోజు వర్షం కారణంగా ప్రజలు లోపలికి వెళ్ళారన్నారు. ఈ పైకప్పు చాలా పాతది కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఇది పురావస్తు భవనం కావడం వల్ల భారత పురావస్తుసర్వే (ASI) అధికారులు దీని మరమ్మతు చేయడానికి అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. చాలాసార్లు దర్గా కమిటీ దీని మరమ్మతు కోసం విజ్ఞప్తి చేసిందన్నారు. పైకప్పు నుండి నీరు లీక్ అవుతుందని, దాన్ని మరమ్మతు చేయనివ్వాలని కోరామన్నారు. కానీ ASI నిరాకరిస్తూ వస్తుందన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా, పైకప్పు పగుళ్లు ఏర్పడిందన్నారు.ఈరోజు వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ముజీబ్ అహ్మద్ తెలిపారు. గదిలో దాదాపు 15 నుండి 20 మంది ఉన్నారు. ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు. మొదట పైకప్పు కూలిపోయిందని, తరువాత గోడ కూలిపోయిందని ఆయన అన్నారు.
Also Read : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!