FASTag Annual Pass: ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్‌ పాస్‌లు వచ్చేశాయి.. ఒక్కసారి చెల్లిస్తే ఏడాదంతా తిరగొచ్చు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యాన్యువల్‌ పాస్‌ను ప్రారంభించింది. . ఈ వార్షిక పాస్‌ కోసం రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే పదేపదే టోల్ చెల్లింపులు చేయాల్సిన పని ఉండదు.

New Update
FASTag Annual Pass launches today

FASTag Annual Pass launches today

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యాన్యువల్‌ పాస్‌ను ప్రారంభించింది. జాతీయ రహదారులపై ప్రయాణం సజావుగా సాగేందుకు వాహనాదారుల కోసం కేంద్రం ఈ పాస్‌ను తీసుకొచ్చింది. ఈ వార్షిక పాస్‌ కోసం రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే పదేపదే టోల్ చెల్లింపులు చేయాల్సిన పని ఉండదు. జాతీయ రహదారులపై ఎక్కువ ప్రయాణించేవారికి ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉండనుంది. అయితే పాస్‌ కార్లు, జీపులు, ప్రైవేటు వాహనాలు, వ్యాన్లకు మాత్రమే పనిచేస్తుంది. 

Also Read: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!

ఈ పాస్‌ కోసం రూ.3 వేలు చెల్లిస్తే.. ఆయా వాహనాలు ఒక ఏడాది లేదా 200 టోల్‌ క్రాసింగ్‌ల వరకు ఇది పనిచేస్తుంది. అంటే ఈ పాస్‌ తీసుకునే వాహనాదారులకు ఏడాది వరకు దీన్ని వాడుకోవచ్చు. ఒకవేళ ఏడాది కాలం కన్నా ముందుగానే 200 టోల్‌ క్రాసింగ్‌లు అయినా కూడా పాస్‌ గడువు ముగుస్తుంది. అయితే ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌(FASTag Annual Plan) తీసుకోవడం వల్ల టోల్‌ బూత్‌ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల లక్షలాది మంది వాహనాదారులు వేగంగా ప్రయాణాలు చేయవచ్చు. అయితే ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్నవాళ్లు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కొనాల్సిన అవసరం ఉండదు. 

ఇది ఎలా పనిచేస్తుంది

ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ అనేది జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలు, ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-సూరత్, ముంబయి-రత్నగిరి, ముంబయి-సూరత్‌ మార్గాల వంటి టోల్‌ ప్లాజాలలో మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర రహదారులు లేదా మున్సిపల్ టోల్‌ రోడ్లపై మాత్రం ఫాస్ట్‌ట్యాగ్‌ అనేది సాధారణంగా పనిచేస్తుంది. టోల్‌ ఛార్జీలు యథావిధాగా కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముంబయి-పుణే ఎక్స్‌ప్రెస్‌వే, ముంబయి-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ వే, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే, మైసూర్‌-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే, అహ్మదాబాద్‌-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేలను రాష్ట్ర అధికారులే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మార్గాల్లో యాన్యూవల్‌ పాస్‌ చెల్లుబాటు కాదని తెలుస్తోంది.          

Also Read: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!

అయితే ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే వంటి క్లోజ్డ్‌ టోలింగ్‌ రహదారుల్లో టోల్ వసూలు అనేది ప్రత్యేకంగా ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిర్వహిస్తారు. ఒకే ట్రిప్‌లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌ పాయింట్లు ఉంటాయి. అలాగే ఢిల్లీ-చండీగఢ్‌ లాంటి ఓపెన్‌ టోలింగ్ రూట్‌లో.. ప్రతి టోల్‌ ప్లాజా క్రాసింగ్‌ ప్రత్యేక ట్రిప్‌గా ఉంటుంది. యాన్యువల్ పాస్‌ గడవు ముగిసేవరకు వాహనాదారులు ఏదైనా నేషనల్ హైవే లేదా ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రయాణాలు చేయవచ్చు. పాస్‌ గడువు ముగిశాక.. మళ్లీ సాధారణ ఫాస్ట్‌ట్యాగ్‌ మాదిరిగానే రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.   

ORRపై పనిచేస్తుందా ?

 హైదరాబాద్‌కు చెందిన ఔటర్ రింగ్‌ రోడ్‌(ORR)పై ఈ వార్షిక పాస్‌ నడుస్తుందా? లేదా అనేది చాలామందికి డౌట్‌ ఉంటుంది. వాస్తవానికి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టును 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ' (HMDA) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇది స్టేట్‌ లెవల్ ఎక్స్‌ప్రెస్ కావడంతో NHAI లేదా మినిస్టరీ ఆఫ్‌ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్‌ అండ్ హైవేస్‌ (MoRTH) పరిధిలోకి రాదు. కాబట్టి ఓఆర్‌ఆర్‌పై ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌ పనిచేయదు. ORRపై ఉన్నటువంటి టోల్ గేట్లను IRB ప్రైవేట్ ఎంటిటీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఇది కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తుంది. కేంద్రం ప్రవేశపెట్టే పాస్‌లు, డిస్కౌంట్ల విషయంలో యాజమాన్య విధానాల ప్రకారమే టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు.  

పాస్ ఎలా పొందాలి ?

ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ ఒక డిజిటల్ ప్రాసెస్. ఇందుకోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌(Rajmargyatra App) ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. లోపల మీ వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్‌ చేయాలి. ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్‌ యాక్టివ్‌గా ఉండాలి. బ్లాక్‌లిస్టులో ఉండకూడదు. పాస్‌ కోసం రూ.3 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించండి. చెల్లింపులు పూర్తయిన తర్వాత మీ యాన్యువల్‌ పాస్‌ ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్‌కి లింక్ అవుతుంది. 

Advertisment
తాజా కథనాలు