/rtv/media/media_files/2025/11/04/insta-2025-11-04-19-04-58.jpg)
Woman Elopes with instagram lover, Left Husband and children in Uttar pradesh,
వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ముక్కలవుతున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలి కోసం భార్యాభర్తలు చంపుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త, పిల్లల్ని వదిలేసి ఇన్‌స్టా లవర్‌తో లేచిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏటావా జిల్లాకు చెందిన 25 ఏళ్ల మనీషా తన భర్త భూప్ సింగ్, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటుంది. ఇటీవల తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయం కాగా అది ప్రేమగా మారింది. దీంతో ఆమె భర్త, పిల్లలను వదిలేసి ఇన్‌స్టా ప్రియుడితో లేచిపోయింది.
Also Read: పో*ర్న్ సైట్లు నిషేధించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆమె భర్త భూప్‌సింగ్ తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మనీషాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అయితే తన భర్త ప్రతిరోజూ తాగుతున్నాడని, జూదం ఆడుతున్నాడని మనీషా కోర్టులో చెప్పింది. అంతేకాదు రాత్రిపూట అపరిచిత వ్యక్తులను ఇంటికి తీసుకొచ్చి వాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకనుంచి తన భర్తతో ఉండలేనని.. పిల్లలను కూడా తీసుకెళ్లలేనని స్పష్టం చేసింది. తన లవర్ ముఖేష్ యాదవ్‌తోనే జీవిస్తానని తేల్చిచెప్పింది.
Also Read: మహిళల అకౌంట్లోకి రూ.30వేలు.. తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన
తన జీవితాన్ని భర్త నరకంగా మార్చాడంటూ వాపోయింది. మరోవైపు మనీషా మామ హన్స్ రాజ్, ఆమె పిల్లలు కోర్టు బయట ఏడుస్తున్నారు. అయినప్పటికీ ఆమె తన లవర్‌తోనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన కోడలు తమ ఇంటిని నాశనం చేసిందని ఆమెతో పాటు అతడి ప్రియుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భర్త భూప్‌సింగ్ మాట్లాడుతూ తన భార్యను ఎవరో బ్రెయిన్ వాష్ చేశారంటూ ఆరోపించాడు. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటని ఆవేదన చెందాడు.
Also Read: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO
Follow Us