Chevella Bus Accident: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అక్కాచెల్లెళ్లు.. చివరకు అంతిమ యాత్రలోనూ కలిసే ఉన్నారని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. భారీగా వర్షం కురుస్తున్న బంధువులు, గ్రామస్తులు కన్నీళ్లతో వారికి వీడ్కోలు పలికారు. వీటికి సంబంధించిన దృశ్యాలు కంటతడిపిస్తున్నాయి.

New Update

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాలకు శోక సంద్రాన్ని మిగిల్చింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం ఏర్పడింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ముగ్గురు కూతుళ్లను బాగా చదివించి, ఉద్యోగాలు చేసి, అత్తింటికి పంపించి వారి సంతోషాన్ని చూడాల్సిన తల్లిదండ్రులు.. కూతుళ్ల మృతదేహాలు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులు పెళ్లి ఉండటంతో తాండూరుకు వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా మృతి చెందారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అక్కాచెల్లెళ్లు.. చివరకు అంతిమ యాత్రలోనూ కలిసే ఉన్నారని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. భారీగా వర్షం కురుస్తున్న బంధువులు, గ్రామస్తులు కన్నీళ్లతో వారికి వీడ్కోలు పలికారు. వీటికి సంబంధించిన దృశ్యాలు చూసి ప్రతీ ఒక్కరిని కంటతడిపిస్తున్నాయి. అయ్యో బిడ్డలు అంటూ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. లారీ డ్రైవర్ చేసిన ఓ చిన్న తప్పిదం తల్లిదండ్రులకు కడుపు కోతను విధించింది. ఈ తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లు కాగా.. గత నెలనే పెద్ద కూతురికి వివాహం జరిగింది. లేకపోయి ఉంటే ఆ కూతురు కూడా ఈ ప్రమాదంలో చనిపోయి ఉండేదేమోనని అంటున్నారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కోఠిలోని ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని చెప్పేవారని ఆ తల్లి గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తోంది. ఆ తల్లికి దేవుడు విధించిన శిక్షను ఎవరూ కూడా తీర్చలేనిది. ముగ్గురు కూతుళ్ల మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోధిస్తుంది. ఆ తల్లి ఏడుపు చూసిన ప్రతీ ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. ఈ హృదయ విదారక ఘటన అందరిని కంటతడిపిస్తుంది.

ఇది కూడా చూడండి: Khammam : చేతులు వెనక్కి విరిచి రెండు సార్లు.. మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలు!

అసలు ఏమైందంటే?

సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర టిప్పర్ లారీ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సుపై దూసుకెళ్లడంతో 24 మంది మృతి చెందారు. లారీ, బస్సు డ్రైవర్‌తో పాటు మహిళలు, పిల్లలు చనిపోయారు. అయితే లారీలో కంకర అధికంగా ఉండటంతో పాటు డ్రైవర్ అతివేగంతో తీసుకెళ్తున్నాడు. అలాగే బస్సులో కూడా ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో ప్రమాద తీవ్రత అధికమైంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 24 మంది మృతి  చెందగా మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు.

ఇది కూడా చూడండి: Clash Over Love Marriage: కూతురు లవ్‌ మ్యారేజ్‌...యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన తండ్రీకొడుకులు..

Advertisment
తాజా కథనాలు