/rtv/media/media_files/2025/11/04/sc-2025-11-04-17-15-36.jpg)
SC declines plea to regulate online content, cites Nepal unrest over social media ban
అశ్లీల కంటెంట్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంటర్నెట్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అశ్లీల కంటెంట్‌పై నిషేధం విధించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇలాంటి వీడియోలు పిల్లల జీవితాలను దారితప్పేలా చేస్తున్నాయని, తీవ్ర దుష్పరిణామాలకు కారణమవుతున్నాయని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. అయితే తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజనల్ ధర్మాసనం దీనికి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO
'' ఇంటర్నెట్‌లో ఉండే పలు సైట్లను నిషేధం విధించడం వల్ల ఇటీవల నేపాల్‌లో ఎలాంటి పరిణామాలు జరిగాయో చూశారు కదా. ఈ పిటిషన్‌ను వెంటనే విచారించలేము. మరో నాలుగు వారాలకు ఈ విచారణను వాయిదా వేస్తున్నామని'' సుప్రీం ధర్మాసనం పేర్కొంది. మరోవైపు నవంబర్ 23న భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది.
Also Read: మహిళల అకౌంట్లోకి రూ.30వేలు.. తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన
అయితే డిజిటల్ యుగం వచ్చాక దేశంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా పెరిగిపోయిందని పిటిషనర్ అన్నారు. అక్షరాస్యత, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీన్ని వాడుతున్నారని పేర్కొన్నారు. ఐటీ యాక్ట్‌లోని 69A ఆర్టికల్ ప్రకారం అశ్లీల కంటెంట్ ఉండే వెబ్‌సైట్లను నిషేధించే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మరి సుప్రీంకోర్టు త్వరలో దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వనుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది.
https://rtvlive.com/national/encounter-in-coimbatore-three-accused-arrested-10620112
Follow Us