/rtv/media/media_files/2025/06/06/4bx1GnZfLS67wjyPAoha.jpg)
VIRAL VIDEO
దేశ వ్యాప్తంగా నిమిషాల్లో గమ్యస్థానానికి చేర్చేందుకు అనేక రైడ్ హెయిలింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడ్ హెయిలింగ్ కంపెనీల సర్వీసులు ప్రయాణికులను అతి తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఓలా, ఉబర్, ర్యాపిడోలకు ఆదరణ పెరగడంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
180 మీటర్లకే ఓలా బైక్ బుకింగ్
నగరాల్లోని చిన్న చిన్న గల్లీల్లో ఉన్నా .. ఈ సర్వీస్ రైడర్లు వచ్చి పిక్ చేసుకుని.. డ్రాపింగ్ పాయింట్ వద్ద వదులుతున్నారు. దీంతో చాలా మంది సమయానికి తమ పనికి చేరుకోవడంతో మరింత ఆదరణ పెరిగింది. అయితే చాలా మంది లాంగ్ జర్నీలు చేసినప్పుడు లేదా తెలియన్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ సర్వీస్‌లను ఉపయోగిస్తుంటారు.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
కానీ ఇక్కడ ఓ యువతి మాత్రం కేవలం 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు.. ఇంత తక్కువ దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకోవడం ఎందుకు?.. ఆమె ధనవంతురాలా? లేక నడవలేక అలా చేసిందా? అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. అయితే ఆ యువతి అలా చేయడానికి ఓ కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.
నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకున్న యువతి..
— Telangana Awaaz (@telanganaawaaz) June 6, 2025
ఉత్తరప్రదేశ్ లక్నోలో 180 మీటర్ల దూరానికే ఓలా బైక్ బుక్ చేసుకున్న యువతి..
ఇంత తక్కువ దూరానికే ఎందుకు బుక్ చేసుకున్నారని రైడర్ అడిగితే దిమ్మదిరిగే జవాబిచ్చిన టీనేజర్..
దూరం తక్కువే కానీ కుక్కలే ఎక్కువ. అందుకే రైడ్ బుక్… pic.twitter.com/zEnziGcHZD
Also Read: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి బయటకు వెళ్లేందుకు ఓలా బైక్ బుక్ చేసుకుంది. దీంతో పిక్ చేసుకునేందుకు బైక్ రైడర్ లోకేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఓటీపీ చెప్పగానే డ్రాపింగ్ పాయింట్ చూపించింది. అది చూసి రైడర్ షాక్ అయ్యాడు. కేవలం 180 మీటర్ల దూరమే డ్రాపింగ్ పాయింట్ ఉండటంతో ఆశ్చర్యపోయాడు.
ఇంత తక్కువ దూరానికే ఎందుకు బుక్ చేసుకున్నారు అని అడిగితే ఆ యువతి దిమ్మదిరిగే జవాబిచ్చింది. దూరం తక్కువే కానీ కుక్కలే ఎక్కువ అని ఆశ్చర్యపోయే సమాధానం చెప్పింది. అందుకే రైడ్ బుక్ చేసుకున్నా అంటూ తెలిపింది. అనంతరం ఆ రైడర్ ఆ అమ్మాయిని బైక్‌పై ఎక్కించుకొని గమ్యస్తానానికి చేర్చాడు. కాగా ఆ యువతి అంత తక్కువ దూరానికి రూ. 19 బిల్లు చెల్లించింది.
viral-videos | latest-telugu-news | today-news-in-telugu | telugu viral news