/rtv/media/media_files/2025/09/15/ec-2025-09-15-17-11-01.jpg)
Will scrap Bihar SIR exercise if, Supreme Court's big warning to poll panel
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం(ECI) బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 65 లక్షల ఓటర్లను తొలగించారంటూ విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. SIRకు సంబంధించి ఈసీ పాటించిన పద్ధతిలో చట్టవిరుద్ధంగా ఏదైనా కనిపిస్తే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
Also Read: భర్త ట్రిపుల్ తలాక్.. కోర్టు ముందే భర్తను చెప్పుతో చితకబాదిన భార్య: వీడియో వైరల్
ఈసీ ఎన్నికల నిర్వహణలో సరైన రూల్స్ పాటించడం లేదని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 7న తుది వాదనాలు వింటామని పేర్కొంది. అనంతరం తీర్పును వెలువరిస్తానని వెల్లడించింది. ఇదిలాఉండగా SIRలో ఆధార్ కార్డును కూడా కచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఈసీకి గైడ్‌లైన్స్ జారీ చేసింది.
Also Read: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా
ముందస్తు సూచనలు ఉన్నాకూడా ఎన్నికల అధికారులు మాత్రం ఆధార్‌కార్డును గుర్తింపు కార్డుగా అంగీకరించడం లేదని ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈసీ చూపించిన అభ్యంతరాలను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆధార్ కార్డు పౌరసత్వాన్ని నిరూపించలేకపోయినప్పటికీ కూడా ప్రజల గుర్తింపునకు అది చట్టబద్ధమైన రుజువని పేర్కొంది.
ఇదిలాఉండగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఈసీ, బీజేపీ కలిసి ఓట్ల చోరీకి యత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఇలానే ఓట్ల చోరీకి పాల్పడ్డారంటూ రాహల్ గాంధీ విమర్శించారు. ఇటీవల కర్ణాటకలోని మహదేవ్‌పుర నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా ఓట్లు చోరీ అయ్యాయని చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఈసీ కూడా స్పందించింది.
Also Read: ఈ అనుమానంతోనే లండన్‌లో నిరసనలు.. బ్రిటన్‌ని కదిలించిన ముగ్గురు పిల్లల చావు
ఓట్ చోరీ లాంటిది ఏం జరగలేదని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే తాము ఓట్ల చోరీ విషయంలో ఆటమ్ బాంబ్ ఆధారాలు తీసుకొచ్చామని.. త్వరలో హైడ్రోజన్ బాంబు లాంటి ఆధారాలతో వస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను బయటపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు.