Jagdeep Dhankhar: జగదీప్‌ ధన్‌ఖడ్‌ మిస్సింగ్.. అమిత్‌ షాకు సంచలన లేఖ

గత కొన్ని రోజులుగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ బయట కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే శివసేన (UBT) సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. ఆయన ఎక్కడున్నారో చెప్పాలని అందులో పేర్కొన్నారు.

New Update

ఇటీవల ఉపరాష్ట్ర పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్లో తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు. అయినప్పటికీ విపక్ష పార్టీల నేతలు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ బయట కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే శివసేన (UBT) సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలవలేకపోతున్నామని.. ఆయన ఎక్కడున్నారో చెప్పాలని అందులో పేర్కొన్నారు. '' మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు. 

Also Read: అసలు నువ్వు మనిషివేనా?  చిన్నారిని నేలపై పడేసి.. గోడకేసి కొట్టి..

ఆయన ఎక్కడున్నారు ? ఆరోగ్యం ఎలా ఉంది అనే దానిపై క్లారిటీ లేదు. ఆయనతో మాట్లాడేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆఖరికీ ఆయన సిబ్బందిని కూడా కలవలేకపోతున్నాం. దీనిపై ఆందోళనగా ఉంది. ధన్‌ఖడ్‌కు అసలేం జరిగింది ? ఆయన క్షేమంగానే ఉన్నారా అనేది దేశ ప్రజలకు తెలియాల్సి ఉందని'' సంజయ్ రౌత్‌ తన లేఖలో రాసుకొచ్చారు. ఈ ఉత్తరాన్ని రౌత్ ఆదివారమే పంపించారు. సోమవారం ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. 

Also Read: ఆగస్టు 27..భారత్ చరిత్రలో ముఖ్యమైన రోజుగా మారనుందా? అమెరికా, భారత్ ఫ్రెండ్షిప్ ముగియనుందా?

జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆచూకీ తెలుసుకునేందుకు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు కూడా సంజయ్ రౌత్‌ చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లేముందు అమిత్‌ షా నుంచి సమాచారం కోరడం ఉత్తమమని అనుకున్నట్లు తెలిపారు. మా ఆందోళనలు అర్థం చేసుకొని ధన్‌ఖడ్‌ ఆచూకీ చెబుతారని ఆశిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల పలువురు విపక్ష నేతలు సైతం జగదీప్‌ ధన్‌ఖడ్‌ సమాచారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

Also Read: భారత్‌కు అణుబాంబు బెదిరింపు.. పాక్‌ ఆర్మీ చీఫ్ సంచలన హెచ్చరిక

ఇదిలా జైల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల మొదటి రోజునే జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆరోజు ఉదయం ఆయన రాజ్యసభలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం నాటికి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్లే తాను ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కానీ విపక్ష నేతలు మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండించారు. నోట్ల కట్టల కేసు విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వ్యవహారంలో ధన్‌ఖడ్‌కు కేంద్రంపై విభేదాలు వచ్చాయని.. అందుకే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని ఆరోపిస్తున్నారు. 

Also Read: డేంజర్ లో మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్.. విమానంలో కాంగ్రెస్ అగ్రనేత!

Advertisment
తాజా కథనాలు