BIG BREAKING: డేంజర్ లో మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్.. విమానంలో కాంగ్రెస్ అగ్రనేత!

మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం లో చిక్కుకుంది. దీనిలో కేసీ వేణుగోపాల్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫ్లైట్ ను దారి మధ్యలో చెన్నైలో ల్యాండ్ చేశారు.  

New Update
New look for Air India flights.

ఎయిర్ ఇండియా విమానం AI2455లో మళ్ళీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో పాటూ వాతావరణ పరిస్థితులు కూడా సహకరించకపోవడంతో విమానాన్ని వెనక్కు మళ్ళించాల్సి వచ్చింది. అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అక్కడా విమానాన్ని పూర్తి తనిఖీ చేశారు. ఇందులో కే సీ వేణు గోపాల్ తో పాటూ మరి కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ ఫ్లైట్ తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళుతోంది.  విమానంలో జరిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. 

కేసీ వేణుగోపాల్ ఎక్స్ పోస్ట్..

దీనిపై కాంగ్రెస్ కేసీ వేణు గోపాల్ తన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ రోజు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అందులో రాశారు. నాతో పాటూ ప్రయాణికులందరూ భయంతో వణికిపోయారని తెలిపారు. ఇలాంటి భయంకరమైన జర్నీని నా జీవితంలో ఎదుర్కోలేదని వేఫుగోపాల్ చెప్పారు. 

Also Read: Earth Quake: టర్కీలో భారీ భూకంపం..29 మందికి తీవ్ర గాయాలు

Advertisment
తాజా కథనాలు