/rtv/media/media_files/2025/05/04/6fS9n0374sBC4U9mLhPl.jpg)
BJP Strategic Plan Behind Nationwide Caste Census
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వచ్చే జనాభా లెక్కలతో పాటుగానే కులగణన కూడా చేస్తామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ బీజీపీ మాత్రం ఈ విషయంలో సైలెంట్‌గా ఉంది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు కేంద్రం ఇలా అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఇది కూడా ఎలక్షన్ స్టంటేనని చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఇప్పుడు కేంద్రం కులగణన చేస్తామని చెబుతోందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
Also Read: 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!
BJP Strategic Plan Behind Nationwide Caste Census
ఇప్పటికే బీహార్‌లో ఉన్న నితిష్ కుమార్ ప్రభుత్వం.. కుల గణన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణలో కూడా కులగణన చేశారు. మరీ ఇప్పుడు కేంద్రం చేపట్టబోయే కులగణనలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చేస్తారా ? లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కలను పరిగణలోకీ తీసుకుంటాయా ? అనే దానిపై స్పష్టత లేదు. కానీ అన్ని రాష్ట్రాలతో పాటే ఈ రెండు రాష్ట్రా్ల్లో కూడా కేంద్ర కులగణన చేపడుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బిహార్, తెలంగాణలో విపక్ష పార్టీలు తమ రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అందులో తప్పుడు లెక్కలు ఉన్నాయని విమర్శలు చేశాయి. దీంతో అన్ని రాష్ట్రాలతో పాటే బిహార్, తెలంగాణలో కూడా కులగణన చేస్తారని చెబుతున్నారు.
Also Read : విషాదం.. వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి
మరోవైపు వచ్చే ఏడాది తమిళనాడు, అస్సాం, కేరళ,పశ్చిమ బెంగాల్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోనే కేంద్రం కులగణన నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా బీసీ కమ్యూనిటీ వాళ్లు రిజర్వేషన్‌పరంగా తమకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. తమ జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తమకు తక్కువగా రిజర్వేషన్ ఉందంటూ చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్‌ను ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పార్లమెంటు ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చింది. బీజేపీ మాత్రం ఈ అంశంలో సైలెంట్‌గా ఉంది. కానీ తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు కులగణనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుబ్యాంకు కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్షనేతలు ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: తెలంగాణలో మారనున్న ఆరు కులాల పేర్లు..
Also Read : నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!
rtv-news | national-news | caste-census