/rtv/media/media_files/2025/05/04/eHQVyffinCrP5Pu6SAXS.jpg)
6 BC communities set for historic name changes to reclaim dignity, identity
తెలంగాణలోని బీసీ కమ్యూనిటీలో చాలా కులాలు ఉన్నాయి. అయితే ఇందులో ఆరు కులాలు వాటి పేర్లు త్వరలో మారనున్నాయి. తమ కులాల పేర్లను దుర్వినియోగం చేస్తున్నారని, సినిమా, రాజకీయాల్లో అభ్యంతరకరంగా వాడుతున్నారని గత కొన్నేళ్లుగా వీళ్లు వాపోతున్నారు. తమ కులాల పేర్లు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చివిరికీ ఈ విషయం 'తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్(BC) కమిషన్' దృష్టికి వెళ్లింది. దీంతో కమిషన్ ఈ కమ్యూనిటీల పేర్లు మార్చేందుకు అంగీకారం తెలిపింది.
Also Read: పాక్ కు భారత సైనిక సమాచారం లీక్...ఇద్దరు ఇంటి దొంగల అరెస్ట్
6 BC Communities Name Changes
తమ కులాల పేర్లు మార్చాలని అడుగుతున్న వాటిలో మొదటిది 'దొమ్మర'. ఈ కమ్యూనిటీ వాళ్లు తమ కులం పేరు మార్చమని కోరుతూనే ఉన్నారు. ఇక రెండవది 'పిట్చిగుంట్ల' కమ్యూనిటీ. వీళ్లు కూడా తమ పేరు మార్చమాని అడుగుతున్నారు. మూడవది 'తమ్మాలి' కమ్యూనిటీ. వీళ్లకి తమ కుల ధ్రువీకరణ పత్రంలో నాన్‌బ్రాహ్మిణ్, శూద్ర అనే పేర్లు ఉన్నాయి. అయితే పేర్లు వివక్షకు గురిచేసేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. అందుకే తమ కులం పేరును మార్చాలని కోరుతున్నారు.
Also Read: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
నాలుగవది 'బుడబుక్కల' కమ్యూనిటి. వీళ్లు కూడా తమ పేరును మార్చుకోవాలని కోరుతున్నారు. బుడబుక్కల పేరు స్థానంలో.. క్షత్రియ, శివ క్షత్రియ, రామ జోషి.. ఈ మూడు పేర్లను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో ఏదో ఒక పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయిదవది ఆర్య క్షత్రియ కమ్యూనిటి. వీళ్లు కూడా తమ కులం పేరు మార్చమని కోరుతున్నారు. ఇక ఆరోవది వీరముష్టి కమ్యూనిటి. వీళ్లు తమ కులానికి వీరభద్రీయ అనే పేరు మార్చాలని ప్రతిపాదన చేశారు. ఈ కమ్యూనిటికి చెందిన విద్యార్థులు, ప్రొఫెషనల్స్ బయట తమ కులం పేరు చెప్పుకోలేకపోతున్నామని అంటున్నారు. అందుకే తమ కులం పేరు మార్చాలని కోరుతున్నారు. మొత్తంగా ఈ ఆరు కమ్యూనిటి పేర్లు త్వరలో మారనున్నాయి. అయితే ఈ కులాల పేర్లు ఫైనల్ చేసేముందు ఎలాంటి అభ్యంతరం లేకుండా జరగాలని చూస్తున్నామని బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ తెలిపారు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్
Also Read : జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి
telangana | caste | rtv-news
Follow Us