TVK President Vijay: వచ్చే ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం..విజయ్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు,  దళపతి విజయ్ అన్నారు. తాము కచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీవీకే రెండవ యానివర్శరీ ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు.

New Update
tn

Vijay dalapathi, Prasanth Kishore

TVK President Vijay: శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగం పార్టీ(Tamilaga Vettri Kazhagam) అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్(Thalapathy Vijay) నమ్మకంగా చెప్పారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా పూంజేరి గ్రామంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం టీవీకే రెండో వార్షిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనిలో విజయ్, ప్రశాంత్ కిషోర్ తో పాటూ పార్టీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల విడుదలలో రెండూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అలాగే హిందీ భాష రుద్దడంపై కూడా విజయ్ మండిపడ్డారు. భాష అనేది వ్యక్తిగతమని, దానిని బలవంతంగా రుద్దడం సమాఖ్య విధానానికి విరుద్ధమన్నారు. త్రిభాషా విధానాలు అమలు చేయకపోతే విద్యానిధులు మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వం అనడం అన్యాయమని విమర్శించారు. 

Also Read: Hyd: ఐదు రోజులు ఎండ దంచికొడుతుంది..జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ

వాట్ బ్రో..ఇట్స్ వెరీ రాంగ్ బ్రో..

భాష విధానంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎల్ కేజీ, యూకేజీ పిల్లల్లా కొట్టుకుంటున్నారని విజయ్ విమర్శించారు. వారిద్దరూ గొడవ పడుతున్నారు అంటే తాము నమ్మాలా అంటూ..వాట్ బ్రో..ఇట్స్ వెరీ రాంగ్ బ్రో అంటూ డైలాగ్ లు కొట్టారు. రాష్ట్ర ప్రజల డిమాండ్లను నెరవేర్చలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. తమిళనాడులో ఉన్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించడానికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి నాటకమాడుతున్నాయని విజయ్ దుయ్యబట్టారు. 

Also Read: Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com

మరోవైపు టీవీఎంకే పార్టీని ఎలా అయినా గెలిపిస్తానని జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. చెన్నై సూపర్ కింగ్ గెలుపులో ధోనీ కీలకపాత్ర ఎలా పోషించాడో..తాను అదే చేసి..వచ్చే ఎన్నికల్లో టీవీకే గెలిస్తే పాపులారిటీలో తాను ధోనీని దాటేస్తానని అన్నారు. టీవీకేను గెలిపిస్తానని చెప్పడానికే ఇప్పుడు కూడా వచ్చానన్నారు ప్రశాంత్ కిషోర్.

Also Read: SLBC Tunnel: 8మంది ప్రాణాలు డౌటే..ప్రమాదస్థలానికి అరకిలోమీటర్ దూరంలో రెస్క్యూటీమ్..

Also Read: SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు