/rtv/media/media_files/2025/04/17/71uQxkblPhTPgXn4OMTR.jpg)
viral video today
ఓ దేవుడా.. నన్ను ఎందుకు ఈ భూమ్మీద పుట్టించావ్. పుట్టించి నాకు ఏమి ఇచ్చావ్? నన్ను దేవుడు మోసం చేశాడు. నాకు రెండు చేతులు, కాళ్లు, చెవులు, కళ్లు, ముక్కు.. ఇలా శరీరంలోని అన్ని భాగాలు శుభ్రంగా ఉన్నాయి. కానీ ఎందుకు నేనేం చేయలేకపోతున్నాను. నా వల్ల ఏమీ కావడం లేదు. నేను ఎందుకు బతకాలి. ఒక పని చేయలేను.. పాటు చేయలేను. నా తోటి మిత్రులు ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా ఉంటున్నారు.
ఇది కూడా చూడండి: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
నా వల్ల ఏమీ కాదు.. ఈ జన్మకి నేనింతే.. అని మీలో మీరే కుమిలి కుమిలి ఏడుస్తున్నారా?.. మీలో మీరే ఏడ్చుకుంటూ ఆ ఆలోచనల్లోంచి బయటకు రాలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే అది ఒక మోటివేషనల్ వీడియో అనే చెప్పాలి. అందులో ఒక వ్యక్తి ధైర్యం, ఆత్మవిశ్వాసం నెటిజన్లను మంత్రముగ్దులను చేసింది.
ఇది కూడా చూడండి: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
మోటివేషనల్ వీడియో వైరల్
ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తికి నడిచేందుకు రెండు కాళ్లూ లేవు.. పోనీ చేతితో ఏదైనా పనిచేద్దామా అంటే రెండు చేతులు కూడా లేవు. అయినా అతడు కృంగిపోలేదు, కుషించిపోలేదు. ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకున్నాడు. ఎదురొచ్చిన సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొని ఎలా బతకాలో చూపించాడు.
అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు?
— వలస పిట్ట 🐧 (@DaariTappiVacha) April 16, 2025
నాకు ఏమి ఇచ్చాడు?
నన్ను మోసం చేశాడు అనేవారికి
ఈ వీడియో అంకితం pic.twitter.com/AKEbSCYjZN
ఇది కూడా చూడండి: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్
బతకడానికి ఓ నాలుగు టైర్ల చిన్న రిక్షాపై సరుకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పుట్టుకతోనే కళ్లూ, చేతులు లేకపోయినా ఎక్కడా కుంగి కుషించిపోలేదు. జీవన పోరాటం ఆపకుండా సాగిస్తూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
viral-video | viral-news | latest-telugu-news | telugu-news