/rtv/media/media_files/2025/03/09/3fPm7Ugr3LBV4nRnkKP4.jpg)
vp
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఛాతీ నొప్పితో, అసౌకర్యంగా ఉందని చెప్పడం వల్ల సుమారు 2 గంటలకు ఎయిమ్స్‌లో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య బృందం నిరంతరం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపాయి. ధన్‌ఖడ్ పరిస్థితిని ఆరా తీయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్‌కు వెళ్లారు.
Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?
Also Read: CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...సోమవారంతో ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగింపు