/rtv/media/media_files/2025/02/03/1frrnzpq7uruOPqP4CnM.jpg)
Maha Kumbh Mela
Kumbh Mela : వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహా కుంభమేళాలో మూడొవ అమృత స్నానం ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్ట భద్రతను అమలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా సోమవారం తెల్లవారుజామున అఖాడాలు మూడొవ 'అమృత్ స్నాన్'ని ప్రారంభించారు. గత అమృత స్నానం రోజున తొక్కిసలాట జరిగి 30 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో మూడవ అమృత స్నానానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కుంభమేళాకు సాధువులతో పాటు భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఇసుకేస్తే రాలనంత జనం ప్రయాగ్‌రాజ్‌లో కనిపిస్తున్నారు.
Also Read: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టు
కాగా గత అమృత స్నానం సమయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుగానే అఖాడాలతో సమావేశమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన రక్షణ చర్యలపై వారితో చర్చించింది. పవిత్ర దినంగా భావించే వసంతపంచమి రోజున నిర్వహించే అమృత స్నానాలకోసం ప్రతి అఖాడాకు సమయం కేటాయించారు. ఒక్కో అఖాడాకు 40 నిమిషాల సమయం నిర్ణయించారు. తొలి ఊరేగింపుగా వెళ్లే సాధువులు వారి పనులు ముగించుకొని నిర్ణిత సమయంలో వారివారి శిబిరాలకు వెళ్లిపోయేలా షెడ్యూల్ ను నిర్ణయించారు.
Also read: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే..
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాసంగం వద్ద పోలీసులు గట్టి నిఘా ఉంచిన నేపథ్యంలో మహానిర్వాణి, అటల్ అఖాడాలు ఉదయం 4 గంటలకే స్నానఘట్టాలకు బయలుదేరారు.మూడవ 'అమృత స్నానం' కోసం అఖాడాల అధిపతులు ఊరేగింపులకు నాయకత్వం వహిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తెల్లవారే సమయానికి వివిధ అఖాడాల నుంచి బూడిద పూసిన నాగసాధువులు త్రివేణి సంగమం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.సాధువులు ఊరేగింపుగా వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరించి సోమవారం మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలలోపు తిరిగి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. వారు వెళ్లిన తర్వాత సాధారణ ప్రజలకు పవిత్ర స్నానాలు చేసే అవకాశాన్ని కల్పిస్తారు. అయితే చాలామంది భక్తులు సంగం వద్దే అమృతస్నానం చేయాలనే ఉద్దేశంతో భారీగా చేరుకుంటున్నారు. గత మౌని అమావాస్య రోజు అక్కడే తొక్కిసలాట జరిగింది. అయితే సంగం వద్దే స్నానాలు ఆచరించాలనే నియమం ఏమీ లేదని ఎక్కడ చేసిన అదే పుణ్యం లభిస్తు్ందని సాధువులు, అధికారులు స్పష్టం చేస్తు్న్నారు.
Also Read: కుంభమేళాలో 'అయోధ్య రామ మందిరం'.. తెలుగు వ్యక్తి టాలెంట్ కి ఫిదా అయిన భక్తులు!
35 కోట్లమంది పుణ్యస్నానాలు
సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయానికి 16.58 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా కుంభమేలా ప్రారంభమైన నాటినుంచి సోమవారం నాటికి పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 34.97 కోట్లకు చేరుకుంది. వీరిలో 10 లక్షల మంది కల్పవాసీలు, 6.58 లక్షల మంది యాత్రికులు ఉన్నారు. ఇప్పటివరకు 33 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో స్నానమాచరించారని, సోమవారం ఒక్కరోజే సుమారు ఐదు కోట్ల మంది యాత్రికులు వస్తారని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గత లోటు పాట్లను అనుభవంలోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పా్ట్లు చేశామని నిర్వహాకులు తెలిపారు.
Also Read: కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే!