/rtv/media/media_files/2025/01/03/XttpRUOq0BiidP1ej4xq.jpg)
vande bharat sleeper coach speed testing
రైల్వే వ్యవస్థ దేశ వ్యాప్తంగా దూసుకుపోతోంది. అత్యధిక మంది ప్రయాణికులు ట్రైన్ జర్నీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికుల రద్దీ, సౌకర్యార్థం కొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగానే గతంలో కొత్తగా వందే భారత్ రైలును తీసుకొచ్చింది. ఇది వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది.
Also Read: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్‌డేట్.. ఐఎండీ కీలక ప్రకటన
తక్కువ సమయంలో తొందరగా గమ్యానికి చేర్చే ఉద్దేశంతో వందే భారత్ రైలును తీసుకొచ్చారు. సాధారణ ట్రైన్ కంటే మూడు, నాలుగు గంటలు ముందే ఇది గమ్యానికి చేర్చుతుంది. అయితే ఈ ట్రైన్ మొదటిగా సీటింగ్ విధానంలో వచ్చింది. దీంతో చాలా మంది గంటలు గంటలు కూర్చోవడానికి కాస్త ఇబ్బంది పడేవారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
తొలిసారిగా స్లీపర్ ట్రైన్లు
Also Read: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్ రా బాబు!
దేశంలో తొలిసారిగా వందే భారత్ స్లీపర్ ట్రైన్లను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా వందేభారత్ స్లీపర్ ట్రైన్ వేగాన్ని పెంచేందుకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో నిర్వహించారు. ఈ టెస్టులో గంటకు గరిష్టంగా 180 కి.మీ వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. దానికి సంబంధించిన వీడియోను రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ట్రయల్ రన్ సూపర్ సక్సెస్...
— Telugu Vibe (@TeluguVibe) January 3, 2025
ట్రయిల్ రన్ సమయంలో 180 కి. మీ./గం. వేగంతో.. కోటా-నాగ్డా సెక్షన్లో దూసుకుపోతున్న వందే భారత్ స్లీపర్.
ఈ నెల చివరిలోపు తొలి వందేభారత్ స్లీపర్ ని ప్రారంభించనున్నారు. #vandebharatexpress pic.twitter.com/w6DjeNsTbU
Also Read: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్ ఇండియాకు?
ఆ వీడియోలో ప్రకారం.. ట్రైన్ 180 కి.మీ వేగంతో దూసుకెళ్లినట్లు కనిపించింది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇంత స్పీడ్‌లోనూ ట్రైన్‌లోపల ట్రైపై పెట్టిన గ్లాస్‌లోని నీరు చుక్క కూడా కింద పడలేదు. అంతేకాకుండా పక్కన పెట్టిన మొబైల్ కూడా కనీసం కదలనట్లు కనిపించింది.
Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
Also Read : ఏడాదికి లక్ష బ్రేక్ దర్శనాలు..అంతా బాబాయి చలవే!
కాగా ఈ రైలు వేగాన్ని పరీక్షిస్తున్న సమయంలో సాధారణ ప్రయాణికుల బరువుకు సమానంగా ఉండే బరువును అందులో ఉంచారు. అనేకమైన ట్రాక్ పరిస్థితుల్లో వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను పరీక్షించారు. ఇక వచ్చే నెల అంటే ఫిబ్రవరిలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని రైల్వే మినిస్టర్ వెల్లడించారు. ఇకపోతే ఈ స్లీపర్ ట్రైన్‌కు మొత్తం 16 బోగీలు ఉండనున్నాయి. అందులో 3ACకి 10 బోగీలు, 2ACకి 4 బోగీలు, 1ACకి ఒకబోగి ఉండనుంది. మిగతాది లగేజీ కోసం ఉపయోగించనున్నారు.