TTD: ఏడాదికి లక్ష బ్రేక్‌ దర్శనాలు..అంతా బాబాయి చలవే!

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రసాదాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నట్లు నివేదిక సమర్పించినట్లు సమాచారం.

New Update
TTD

TTD

Tirumala: వైసీపీ హయాంలో తిరుమల కొండపై సాగిన దర్శన టికెట్ల దందాను విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తాజాగా నిగ్గు తేల్చింది.మాజీ సీఎం జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి ఏకంగా ఏడాదికి లక్ష బ్రేక్‌ దర్శనాలు ఇప్పించినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపింది. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా ఇంజినీరింగ్‌ పనులకు అవసరానికి మించి నిధులు ఖర్చు పెట్టినట్లు, దానికి నాటి ఈవో ధర్మారెడ్డి కూడా వత్తాసు పలికినట్లు తెలిసింది. 

Also Read: Madhya Pradesh: పెళ్లి చేసుకోకపోయినా.. దానికి ఒకే అంటున్న హైకోర్టు!

గత ఐదేళ్లలో తిరుమలను వైసీపీ నేతలు ఎలా ఉపయోగించుకున్నారో వేంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని ఎలా దోచుకుతిన్నారో విజిలెన్స్‌ తేల్చి చెప్పింది. అప్పడు టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున తన పదవిని ఉపయోగించుకుని  బ్రేక్‌దర్శన టికెట్లను కేటాయించినట్లు విజిలెన్స్అధికారులు కనిపెట్టారు.

జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి దాదాపు నాలుగేళ్లు టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా ఆ నాలుగేళ్లలో సుమారు 4లక్షల బ్రేక్‌దర్శనాలకు సిఫార్సు చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. అంటే రోజూ 273 మందికి ఇప్పించారు. 300 రూపాయల దర్శన టికెట్లు రోజూ 2 నుంచి 3వేల వరకూ కేవలం వైవీ కార్యాలయం నుంచి సిఫార్సు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా వంటి వారు కూడా  ఒకే సామాజికవర్గానికి చెందిన నాటి ప్రజాప్రతినిధులకు వారి ఇష్టం వచ్చినట్లు  సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు కేటాయించేవారని గుర్తించారు.

Also Read: Delhi: వణుకుతున్న ఉత్తరాది..విమానాలు, రైల్వే సర్వీసుల పై ఎఫెక్ట్‌!

బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి..

ఇక తిరుమల ప్రసాదాల ముడిసరుకుల్లోనూ భారీగానే అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విజిలెన్స్ అధికారులు వివరించారు.తిరుమలలో ప్రసాదాల్లో వాడే బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిపారు.

ధర తక్కువగా ఉన్నప్పుడు రెండు నెలలకు ఓసారి, ధర అధికంగా ఉన్నప్పుడు ఆరు నెలలకు ఓసారి తీసుకున్నట్లు సమాచారం. టెండర్‌ ప్రమాణాలకు విరుద్ధంగా గుత్తేదారులు ద్వితీయశ్రేణి సరకులిచ్చినా పట్టించుకోకుండా టీటీడీకి నష్టం చేకూర్చి నట్లు తేల్చారు.సుబ్బారెడ్డి సారథ్యంలోనే కాదు ఆయన తర్వాత టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన కరుణాకర్‌ రెడ్డి హయాంలోనూ నష్టం జరిగిందని విజిలెన్స్‌ నివేదికలో వెల్లడించింది. 

కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో  తిరుపతిలోని గోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి సత్రాలు కూల్చేసి రూ. 600 కోట్లతో అచ్యుతం, శ్రీపథం వసతిగృహాలు నిర్మించాలనుకున్నారు. 2023 ఫిబ్రవరిలో సత్రాల మరమ్మతులకు రూ. 30 కోట్ల 60 లక్షలు కేటాయించాలంటూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు.

Also Read:Prakasam: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ రెడీ..తొలిసారి ప్యాసింజర్‌ రైలు!

Also Read: Ap: ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త..రేపటి నుంచే ఆ పథకం అమలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు