/rtv/media/media_files/2025/04/30/eMR0zavyZwOmpbhgsnBi.jpg)
Uttar Pradesh young man threw chilli powder mobile shop owner
వీడు దొంగ కాదు.. అంతకుమించి. కంట్లో గొడ్డు కారం కొట్టి డబ్బులతో పరారైన గజదొంగ. పట్టపగలే భయం లేకుండా మొబైల్ షాప్‌కు వచ్చి.. ఎవరూ లేని సమయంలో షాప్ యజమాని కళ్లలో కారం కొట్టి జంప్ అయ్యాడు ఓ యువకుడు. ఇవాళ జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
కళ్లలో కారం కొట్టి డబ్బులతో జంప్
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో సూహైల్ అనే వ్యక్తి మొబైల్ షాప్ రన్ చేస్తున్నాడు. ఇవాళ కస్టమర్‌లాగా ఓ వ్యక్తి అతడి మొబైల్ షాప్‌కు వచ్చాడు. ముఖానికి మాస్క్, క్యాప్ లాంటి హుడీ ధరించాడు. అనంతరం తన మొబైల్‌కు రీఛార్జ్ చేయమన్నాడు. మొదట రూ.19లకి రీఛార్జ్ చేయమన్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి రూ.29లకి మరో రీఛార్జ్ చేయమని సూహైల్‌ను అడిగాడు.
उत्तर प्रदेश के जिला बिजनौर में बदमाश ने आंखों में लाल मिर्ची पाउडर डालकर मोबाइल शॉप मालिक सुहैल से 50 हजार रुपए लूटे !!
— Lokmanchtoday (@lokmanchtoday) April 30, 2025
बदमाश ने कस्टमर बनकर पहले 19, फिर 29 रुपए का रिचार्ज कराया। फिर जैकेट से मिर्ची पाउडर निकालकर दुकानदार की आंखों में फेंक दिया।@Uppolice pic.twitter.com/sy4XD8Y0JJ
Also Read: బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!
ఆ బిజీలో సూహైల్ ఉన్నాడు. ఆ తర్వాత డబ్బుల లాకర్ వద్దకు సూహైల్ వెళ్లగా ఆ దొంగ ఒక్కసారిగా పైకి లేచాడు. అలా సూహైల్ దగ్గరకు వెళ్లాడు. లాకర్‌లో డబ్బులు తీస్తున్న సూహైల్ కళ్లలో ఒక్కసారిగా కారం కొట్టాడు. దీంతో సూహైల్ కళ్లు మండిపోయి ఆందోళనకు గురయ్యాడు. అదే సమయంలో లాకర్‌లో ఉన్న రూ.50వేల డబ్బు కట్ట తీసుకుని ఆ దొంగ పారిపోయాడు.
Also Read: 'పాకిస్తాన్ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!
అతడిని పట్టుకునేందుకు సూహైల్ ఎంతో ప్రయత్నం చేశాడు. గట్టిగా అరిచాడు. కానీ ఫలితం లేకపోయింది. అతడి అరుపులు విన్న స్థానికులు మొబైల్ షాప్‌కు పరుగులు తీశారు. వెంటనే అతడి కళ్లు కడిగి పోలీస్ స్టేషన్‌కు పట్టికెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్‌గా మారింది.
Also Read:దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!
crime news | latest-telugu-news | telugu-news | viral-video