Shocking News: ఇంజనీర్ ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. అసలేమైందంటే?

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వినీత్ దూబే అనే వ్యక్తి జుట్టు మార్పిడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గోరఖ్‌పూర్‌కు చెందిన వినీత్ పంకీ పవర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. చికిత్స ఫలించక అతను ప్రాణాలు కోల్పోయాడు.

New Update
Hair Transplant

Hair Transplant

Hair Transplant: నేటి కాలంలో అధిక ఒత్తిడి కారణంగా జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. కొంత మందికి ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో బట్టతల వస్తుంది. తలపై జుట్టు సన్నబడటం లేదా పూర్తిగా జుట్టు పోవడం అనేది మానసిక ఒత్తిడికి దారితీసే అంశం. ఆయుర్వేద, హోమియోపతి, ఆల్టర్నేటివ్ థెరపీ, ఆయిల్ మసాజ్, సర్జరీ వంటి ఎన్నో మార్గాలతోపాటు జుట్టు మార్పిడి పద్ధతిని ట్రై చేస్తారు.  ఇది జుట్టు నష్టం ఎదురవుతున్న ప్రాంతాల్లో శరీరంలోని ఇతర భాగాల నుంచి వెంట్రుకలు తీసి నాటే ప్రక్రియ. ఈ విధానం తిరిగి జుట్టు పెరగడానికి సహాయపడింది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంది.

Also Read :  డయాబెటిస్ ఉన్నవాళ్లు గ్లూకోజ్ పౌడర్ తాగవచ్చా?

చికిత్స ఫలించక..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వినీత్ దూబే అనే వ్యక్తి జుట్టు మార్పిడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గోరఖ్‌పూర్‌కు చెందిన వినీత్  పంకీ పవర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్చి 13న అతను జుట్టు మార్పిడి కోసం ఎంపైర్ వారాహి క్లినిక్‌ను సంప్రదించాడు. అక్కడ అనుష్క తివారీ అనే మహిళా డాక్టర్‌ను కలిశాడు. చికిత్సలో భాగంగా ఆమె ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే వినీత్ ముఖం ఉబ్బిపోయింది. వెంటనే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అందించిన చికిత్స ఫలించక అతను ప్రాణాలు కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: ఈ ఆయిల్స్‌ వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Also Read :  ఈ జ్యూస్ తాగితే.. యూరిక్ యాసిడ్ సమస్యలన్నీ పరార్

జుట్టు మార్పిడి వంటి ప్రక్రియలు చేయించుకునే ముందు సరైన సమాచారం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అర్హత,  అనుభవజ్ఞులైన వారి పర్యవేక్షణలో ఈ చికిత్సలు చేయించుకోవాలి. చికిత్స ముందు పూర్తి వైద్య పరీక్షలు, అలెర్జీ, ఇతర ఆరోగ్య సంబంధిత పరిస్థితులు పరీక్షించుకోవాలి. ఏ చికిత్సైనా ముందు దాని ప్రయోజనాలూ, ప్రమాదాలూ పూర్తిగా అర్థం చేసుకుని సురక్షిత మార్గాన్ని ఎంచుకోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

  ఇది కూడా చదవండి: బరువు త్వరగా తగ్గాలని ఉందా..? ఈ 7 రకాల పానీయాలు ట్రై చేయండి

health-tips | crime news | latest-news | telugu-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు