ఈ జ్యూస్ తాగితే.. యూరిక్ యాసిడ్ సమస్యలన్నీ పరార్

కాకరకాయ జ్యూస్ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఔషధ గుణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Bitter Gourd Juice 1

Bitter Gourd Juice 1

ప్రస్తుతం రోజుల్లో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. ఈ సమస్య ఉంటే మూత్ర సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు కీళ్ల సమస్యలు, కూర్చోవడానికి ఇబ్బందులు, గుండె జబ్బులు, రక్తపోటు, మూత్రపిండాల్లో రాళ్లు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు..

ఈ యూరిక్ యాసిడ్ సమస్యను వెంటనే తగ్గించుకోవాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడతారు. అయితే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే కాకరకాయ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది.

ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కాకరకాయ జ్యూస్‌ను రోజుకి గ్లాస్ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య క్లియర్ అవుతుంని నిపుణులు అంటున్నారు. కాకరకాయలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, బీటా-కెరోటిన్ వంటివి ఉన్నాయి. ఇవి యూరిక్ యాసిడ్‌తో పాటు మధుమేహం వంటివి రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడాాాాాాాాాాాాాాాాాాాాా ఉంటాయని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు