/rtv/media/media_files/2025/05/01/0kJJVX1KLYZsjfRNHbzK.jpg)
beard issue
నిజానికి అమ్మాయిలకు క్లీన్ షేవ్ అబ్బాయిల కంటే.. గడ్డం ఉన్న వారంటేనే ఎక్కువ ఇష్టం. కానీ యూపీకి చెందిన ఓ మహిళ మాత్రం తనకు గడ్డం ఇష్టం లేదనే కారణంతో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న అర్షి అనే యువతికి మౌలానా షకీర్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. ఇంటర్ వరకు చదవడంతో ప్రస్తుతం ఈమె చదువు కొనసాగిస్తోంది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
తీసేది లేదని భర్త స్పష్టం చేయడంతో..
పెళ్లి అయిన మొదటి రోజు నుంచే భర్త గడ్డం నచ్చలేదని తెలిపింది. ఈ విషయంపై చాలా సార్లు గొడవ కూడా జరిగింది. భార్య ఎంత చెప్పినా కూడా భర్త షకీర్ గడ్డం తీసేది లేదని స్పష్టం చేశాడు. అయితే భర్త ఉదయం పనికి వెళ్లిన తర్వాత ఇంట్లో క్లీన్ ఫేస్‌తో తన తమ్ముడు కనిపించేవాడు. దీంతో షకీర్ సోదరుడుతో క్లోజ్ అయ్యి.. తనతో వెళ్లిపోయిందని పోలీసులకు తెలిపాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
ఇదిలా ఉండగా ఇటీవల ఒడిశాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు తన మనసు మార్చుకుని బాధితురాలినే భార్యగా అంగీకరించాడు. అంతేకాదు ఖైదీగా ఉండగానే ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. అయితే చట్ట ప్రకారం ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు నిందితుడు జైలులోనే ఉండనుండగా జరిగింది.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!
ఒడిశా రాష్ట్రంలోని గోచాబాదికి చెందిన సూర్యకాంత్ బెహెరా.. 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మొదట ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి దారుణానికి ఒడిగట్టాడు. కోరిక తీరగానే మొహం చాటేశాడు. దీంతో ఆ యువతి మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 2024 నవంబరులో సూర్యకాంత్‌ను అరెస్టు చేసి కొడాలా సబ్‌జైలుకు తరలించారు. ఇప్పుడు ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కేసు కొట్టివేశారు.
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..