Sperm Count Test : కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే మీ స్పెర్మ్ కౌంట్ను చెక్ చేసుకోండి!

పురుషులు స్పెర్మ్ కౌంట్ గురించి తెలుసుకోవడం ఇప్పుడు గతంలో కంటే సులభం అయింది. ఈ రోజుల్లో, ఇంట్లోనే స్పెర్మ్ కౌంట్ టెస్ట్ కిట్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.  వీటి సహాయంతో మీరు ఆసుపత్రికి వెళ్లకుండానే మీ స్పెర్మ్ కౌంట్‌ను చెక్ చేసుకోవచ్చు.

New Update
sperm-test

sperm-test

ఈ రోజుల్లో తీవ్రమైన కాలుష్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు  కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ వేగంగా తగ్గుతోంది. స్పెర్మ్ కౌంట్ తగ్గితే తండ్రి అయ్యే అవకాశాలు తగ్గుతాయి. అందుకే డాక్టర్లు తరచుగా వీర్యకణాల సంఖ్యను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సలహా ఇస్తారు. సాధారణంగా స్పెర్మ్ కౌంట్‌ను ఆసుపత్రిలో చెక్ చేస్తారు.  అయితే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని కూడా మీ స్పెర్మ్ కౌంట్‌ను చెక్ చేసుకోవచ్చు. 

Also Read :  వర్షిణి కావాలి..  జైలులో పూజలు చేస్తున్న అఘోరీ!

గతంలో కంటే సులభం

పురుషులు స్పెర్మ్ కౌంట్ గురించి తెలుసుకోవడం ఇప్పుడు గతంలో కంటే సులభం అయింది. ఈ రోజుల్లో, ఇంట్లోనే స్పెర్మ్ కౌంట్ టెస్ట్ కిట్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.  వీటి సహాయంతో మీరు ఆసుపత్రికి వెళ్లకుండానే మీ స్పెర్మ్ కౌంట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఈ టెస్టు సౌకర్యవంతంగానే ఉండటమే కాకుండా గోప్యతను కాపాడుకోవచ్చు. మార్కెట్ లో అనేక బ్రాండ్లతో కూడిన స్పెర్మ్ కౌంట్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కిట్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా లభిస్తాయి. వీటిలో పరీక్షకు సంబంధించిన కిట్లతో లభిస్తుంది.

Also Read :  నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఈ పరీక్షకు ముందు 2 నుండి 7 రోజుల వరకు లైంగికంగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా టెస్టుకు మందు ఏ రకమైన లూబ్రికెంట్లను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇవి కిట్ ఫలితాలను తారుమారు చేయవచ్చు. కిట్‌లో అందించిన కలెక్షన్ కప్పులో స్పెర్మ్ నమూనాను సేకరించి ఓ 20 నిమిషాలు అలా పక్కకు ఉంచండి  అనంతరం అది పూర్తిగా ద్రవంగా మారుతుంది. తరువాత సిరంజి సహాయంతో నమూనాను నమూనా టెస్టు కిట్ లో పోయాలి. స్పెర్మ్ కౌంట్ ఫలితం కేవలం 5 నుండి 10 నిమిషాల్లోనే కిట్‌లో కనిపిస్తుంది. కిట్‌లోని టెస్ట్ లైన్, కంట్రోల్ లైన్ రెండూ కనిపిస్తే స్పెర్మ్ కౌంట్ సాధారణంగా ఉందని అర్థం. ఒకవేళ కిట్‌లో కంట్రోల్ లైన్ మాత్రమే కనిపిస్తే స్పెర్మ్ కౌంట్ సాధారణం కంటే తక్కువగా ఉందని అర్థం.  

Also Read :  మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ.. విద్యార్థిని కిడ్నాప్ చేసి.. మూత్రం తాగించి ( సెల్ఫీ వీడియో వైరల్)

మీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే వెంటనే  వైద్యుడిని సంప్రదించడంతో పాటు, మీ జీవనశైలిపై కూడా శ్రద్ధ వహించండి. మెరుగైన జీవనశైలి, మంచి ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా శారీరక శ్రమ వీర్యకణాల సంఖ్యతో పాటుగా శుక్రకణాల నాణ్యతను మెరుగుపరుస్తాయి.

Also Read :  అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం

telugu-news | life-style | sperm | sperm-count | Sperm Count Test

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు