Supreme Court: ఉర్దూ ఇండియాలోనే పుట్టింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సైన్‌బోర్డులకు ఉర్దూ భాష వాడటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఓ మున్సిపల్ కౌన్సిల్‌కు ఉర్దూ భాషలో రాసిన సైన్‌ బోర్డుకు ఉండటాన్ని సమర్ధించింది.కేవలం మరాఠీ మాత్రమే వాడాలన్న వాదనను తిరస్కరించింది. ఉర్దూ ఇండియాలోనే పుట్టిందని తెలిపింది.

New Update
Supreme Court

Supreme Court

సైన్‌బోర్డులకు ఉర్దూ భాష వాడటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఓ మున్సిపల్ కౌన్సిల్‌కు ఉర్దూ భాషలో రాసిన సైన్‌ బోర్డుకు ఉండటాన్ని సమర్ధించింది. జ‌స్టిస్ సుధాన్షు దూలియా,  కే వినోద్ చంద్రన్‌ల‌తో కూడిన ధర్మాసనం బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఉర్ధూ, మరాఠీ భాషకు రాజ్యాంగం ప్రకారం ఒకే రకమైన హోదా ఉన్నట్లు పేర్కొంది. కేవలం మరాఠీ మాత్రమే వాడాలన్న వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ‌ర్షతై సంజ‌య్ బ‌గ‌డే అనే వ్యక్తి దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Also Read: ఇక 40 ఏళ్లు వస్తే ఉద్యోగం ఊస్ట్.. షాకింగ్ ప్రకటన!

ఇక వివరాల్లోకి వెళ్తే.. పాటూరు పట్టణంలో సంజయ్ మాజీ కౌన్సిలర్. అయితే పాటూరు మున్సిపల్ కౌన్సిల్ బోర్డు పేరును ఉర్దూలో రాయడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఉర్దూ ఇండియాలోనే పుట్టిందని.. కానీ ఆ భాష ముస్లింలకు సొంతమైందని తెలిపింది. హిందువులకు హిందీ భాషను, ముస్లింలకు ఉర్దూ భాషను బ్రిటీష్‌ పాలకుల అంటగట్టారని పేర్కొంది. 

Also Read: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

ఉర్దూ భాషకు ఇండియాలో ఆనవాళ్లు ఉన్నాయని.. ఒక మతానికి మాత్రమే ఆ భాషను ఆపాదించలేమని కోర్టు తెలిపింది. ఉర్ధూను భారతీయులు ఏలియన్‌గా చూస్తున్నారని.. ఇది నిజం కాదని తెలిపింది. మరాఠీ, హిందీ భాషల తరహాలోనే ఉర్దూ భాష కూడా ఉండో ఆర్యన్‌ లాంగ్వేజ్ అని కోర్టు చెప్పింది. ఉర్దూ భాష ఈ నేలపైనే పుట్టిందని స్పష్టం చేసింది. చట్టం ప్రకారం ఉర్దూను నిషేధిత భాషగా చూడలేమని తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం.. మరాఠీ, ఉర్దూ భాషలు ఒక్కటే అని కోర్టు స్పష్టం చేసింది.

Also Read: చైనాకు మరో బిగ్ షాక్.. 245 శాతం టారిఫ్‌ విధించిన ట్రంప్‌ సర్కార్

 

 rtv-news | telugu-news | urdu | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు