/rtv/media/media_files/2025/04/16/cDS6KTrQ0ZsJeEBuWwvf.jpg)
Haryana YouTuber Strangles Husband with Lover
ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు.
Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!
2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్.. ప్రవీణ్ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.
A man was allegedly killed by his wife and her lover after he discovered their affair in Haryana's Bhiwani, police said. The accused, Ravina, a YouTuber, and her lover transported her husband Praveen's body on their bike and dumped it in a drain outside the city in March.… pic.twitter.com/Okfmz2gRZU
— IndiaToday (@IndiaToday) April 15, 2025
Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు
చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది.