Aadhar Voter ID Link Updates: ఆధార్-ఓటర్ ఐడీ లింక్.. కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం..
ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఓటర్ ఐడీ ఆధార్ లింక్ కోసం ఫామ్ 6బి సమర్పణకు మార్చి 2024 చివరి తేదీగా ప్రకటించింది. అయితే, తప్పనిసరిగా లింక్ చేయాలనే రూల్ ఏమీ లేదని, ఓటర్లు తమ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చునని తెలిపింది.