Financial Changes: మీరు ఇవి పూర్తి చేశారా? సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!
ఆర్థిక పరంగా సెప్టెంబర్ నెలలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిలో కొన్ని నెల మొదటి రోజు నుండి అమలులోకి వస్తుండగా.. మరికొన్ని నెల చివరలో వచ్చే అవకాశం ఉంది. వీటిలో అతి ముఖ్యమైన విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.. ఇవి ప్రజల జేబులను ప్రభావితం చేయనున్నాయి. ఆధార్ అప్డేట్, ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేయడం, క్రిడెక్ కార్డు బిల్లులో మార్పులు రానున్నాయి. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎక్కువ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు నిబంధనలు, షరతులకు సంబంధించి బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది.